పుష్ప తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ (Allu Arjun) ఇప్పటికే నేషనల్ లెవెల్ క్రేజ్ తో అదరగొట్టేస్తున్నాడు. త్వరలో రాబోతున్న పుష్ప 2 సినిమా పై కూడా అన్ని చోట్ల భారీ అంచనాలు ఉన్నాయి. ఆ సినిమా తప్పకుండా పార్ట్ 1 కన్నా భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. ఐతే పుష్ప తో నేషనల్ వైడ్ గా తన మాస్ స్టామినా చూపించి నేషనల్ అవార్డ్ కూడా అందుకున్న అల్లు అర్జున్ చేతికి ఇప్పుడు ప్రముఖ శీతల పానీయం థమ్స్ అప్ కూడా వచ్చింది.
స్టార్ రేంజ్ ని బట్టి యాడ్స్ వస్తుంటాయి. తెలుగులో అయితే సూపర్ స్టార్ మహేష్ వాణిజ్య ప్రకటనల్లో ముందుంటాడు. యాడ్స్ ద్వారా వచ్చిన మొత్తాన్ని చిన్న పిల్లల గుండె ఆపరేషన్ కి ఖర్చు చేస్తాడు మహేష్. సౌత్ లో యాడ్స్ అంటే అది మహేష్ తర్వాతే ఎవరైనా అయితే శీతల పానీయాలకు ఆల్రెడీ మహేష్ చేస్తున్నాడు.
ఇదివరకు థమ్స్ అప్ కి మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. ఐతే ఆ కాంట్రాక్ట్ ముగియడంతో థమ్స్ అప్ ని వదిలి మౌంటెన్ డ్యూని తీసుకున్నాడు మహేష్. ఐతే మహేష్ వదిలిన థమ్స్ అప్ కి రౌడీ హీరో విజయ్ దేవరకొండ గ్రాబ్ చేశాడు. ఐతే ఇప్పుడు విజయ్ కూడా ఆ అగ్రిమెంట్ పూర్తి కావడంతో అల్లు అర్జున్ కి ఆ ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. థమ్స్ అప్ యాడ్ తో త్వరలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు.
బన్నీ కూడా ఇదివరకు కోకా కోలాకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. ఇప్పుడు కోక్ వదిలి థమ్స్ అప్ (Thumbs Up) కి వచ్చాడు. ఈ యాడ్ కోసం బన్నీ భారీగానే రెమ్యునరేషన్ తీసుకుని ఉంటాడని అంటున్నారు.
Also Read : Amitabh Bachchan : స్విగ్గి షేర్లు కొన్న కల్కి స్టార్..!