Allu Arjun Leaks Dialogue: ‘పుష్ప 2’ సినిమాలో డైలాగ్‌ని లీక్ చేసిన అల్లు అర్జున్‌.. క్షణాల్లో వీడియో వైరల్..!

‘పుష్ప 2’ సినిమాలోని ఓ డైలాగ్‌ని అల్లు అర్జున్‌ లీక్‌ (Allu Arjun Leaks Dialogue) చేశారు. ‘బేబీ’ సినిమా ఈవెంట్‌లో ఆ డైలాగ్ చెప్పి ఆ సినిమాపై అంచనాలు పెంచారు.

Published By: HashtagU Telugu Desk
Allu Arjun

Allu Arjun

Allu Arjun Leaks Dialogue: ‘పుష్ప 2’ సినిమాలోని ఓ డైలాగ్‌ని అల్లు అర్జున్‌ లీక్‌ (Allu Arjun Leaks Dialogue) చేశారు. ‘బేబీ’ సినిమా ఈవెంట్‌లో ఆ డైలాగ్ చెప్పి ఆ సినిమాపై అంచనాలు పెంచారు. ‘బేబీ’ సినిమా బాగా నచ్చిందన్న ఆయన చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రసంగం ముగుస్తుండగా ‘పుష్ప 2’లోని డైలాగ్‌ కావాలని అభిమానులు కోరారు. బన్నీ చెప్పిన డైలాగ్‌ కొన్ని క్షణాల్లోనే నెట్టింట వైరల్‌గా మారింది. ‘‘ఈడంతా జరిగేది ఒకటే రూల్ మీద జరుగుతాండాది.. పుష్పా గాడి రూల్’’ అని బన్నీ చెప్పిన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆనంద్ దేవరకొండ హీరోగా దర్శకుడు సాయి రాజేశ్ తెరకెక్కించిన బేబీ ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ మూవీ మేకర్స్ హైదరాబాద్‌లో అప్రిసియేషన్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బేబీ మూవీ చాలా బాగుందని ప్రశంసించిన ఆయన చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. చివర్లో అభిమానులు పుష్ప-2 డైలాగ్ కావాలని కోరగా ఆయన ఈ డైలాగ్ వినిపించారు. ‘‘ఈడంతా జరిగేది ఒకటే రూల్ మీద జరుగుతాండాది.. పుష్పా గాడి రూల్’’ అని అల్లు అర్జున్ అనడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక్కడ పుష్ఫ-2 డైలాగ్ చెబుతానని అస్సలు అనుకోలేదని అల్లు అర్జున్ చెప్పారు.

Also Read: Project K Glimpse : ప్రాజెక్ట్ K టైటిల్, గ్లింప్స్ వచ్చేసింది.. అదిరిపోయిన విజువల్స్.. హాలీవుడ్ ని మించి..

అలానే మరోసారి మెగాస్టార్ చిరంజీవిపై తన ప్రేమను చాటుకున్నారు అల్లు అర్జున్. బేబీ నిర్మాత ఎస్‌కెఎన్ గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ.. అల్లు శిరీష్ తనకు ఎస్‌కెఎన్‌ని పరిచయం చేసాడు. తన చివరి శ్వాస వరకు మెగాస్టార్ చిరంజీవిని ఆరాధిస్తూనే ఉంటానని ఐకాన్ స్టార్ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చిరంజీవిని ఎక్కువగా ఆరాధించేవారిలో అల్లు అర్జున్ ఒకరు. బన్నీ అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పారు. అయితే చాలాకాలంగా అల్లు ఫ్యామిలీకీ, చిరు ఫ్యామిలీకి మధ్య విభేధాలున్నాయని నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అల్లు అర్జున్‌ చేసిన వ్యాఖ్యలు వీటికి ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయింది.

  Last Updated: 21 Jul 2023, 08:35 AM IST