sreeleela: ట్రోల్స్ భయంతో ఒంటరిగా కూర్చుని ఏడ్చేదాన్ని.

Sreeleela  టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. ‘పెళ్లి సందడి’, ‘ధమాకా’ చిత్రాలతో ఓవర్ నైట్ స్టార్‌డమ్ తెచ్చుకున్న ఈమె, తాజాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే, కెరీర్ తొలినాళ్లలో తనపై వచ్చిన దారుణమైన ట్రోల్స్ చూసి తట్టుకోలేక ఏడ్చేదాన్నని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దశలో సినిమాలు వదిలేసి చదువుకుంటానని అమ్మతో చెప్పగా, ఆమె ఇచ్చిన ధైర్యంతోనే నిలబడ్డానని తెలిపారు. […]

Published By: HashtagU Telugu Desk
Sreeleela

Sreeleela

Sreeleela  టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. ‘పెళ్లి సందడి’, ‘ధమాకా’ చిత్రాలతో ఓవర్ నైట్ స్టార్‌డమ్ తెచ్చుకున్న ఈమె, తాజాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే, కెరీర్ తొలినాళ్లలో తనపై వచ్చిన దారుణమైన ట్రోల్స్ చూసి తట్టుకోలేక ఏడ్చేదాన్నని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దశలో సినిమాలు వదిలేసి చదువుకుంటానని అమ్మతో చెప్పగా, ఆమె ఇచ్చిన ధైర్యంతోనే నిలబడ్డానని తెలిపారు.

తెలుగు చిత్ర పరిశ్రమలోకి మెరుపుతీగలా దూసుకొచ్చి అతి తక్కువ సమయంలోనే అగ్ర హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుని ‘మోస్ట్ వాంటెడ్’ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది అచ్చ తెలుగమ్మాయి శ్రీలీల. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన ‘పెళ్లి సందడి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీల, తన డ్యాన్సింగ్ స్కిల్స్, ఎనర్జీతో కుర్రకారును ఆకట్టుకుంది. ఆ తర్వాత రవితేజతో చేసిన ‘ధమాకా’ బ్లాక్‌బస్టర్ కావడంతో ఆమె దశ తిరిగింది. మహేశ్ బాబు, నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంది. అయితే తొలినాళ్లలో ఒకటి రెండు హిట్లు అందుకున్నా ఆ తర్వాత వరుస పరాజయాలు ఆమెను చుట్టుముట్టాయి. ఒకప్పుడు లక్కీ గర్ల్ అని ఆకాశానికెత్తేసిన ఇండస్ట్రీ.. ఫ్లాపుల కారణంగా ఆమెపై ఐరన్ లెగ్ ముద్ర వేసింది. అయినప్పటికీ ఢీలా పడకుండా తన సత్తా చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి భారీ ప్రాజెక్టుతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి తన సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తోంది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శ్రీలీల తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంది. సోషల్ మీడియాలో తనపై వచ్చిన విపరీతమైన ట్రోలింగ్ చూసి ఒక దశలో ఆమె ఎంతో కుంగిపోయిందట. “నేను చాలా సెన్సిటివ్. కెరీర్ మొదట్లో నాపై వచ్చిన నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ చూసి తట్టుకోలేకపోయేదాన్ని. గదిలో ఒంటరిగా కూర్చుని ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ బాధ భరించలేక సినిమాలు నా ఒంటికి పడవని నిర్ణయించుకున్నాను. అమ్మ దగ్గరకు వెళ్లి ‘నేను ఇక సినిమాలు చేయను, మళ్లీ కాలేజీకి వెళ్లి చదువుకుంటాను’ అని చెప్పేశాను” అని శ్రీలీల ఆవేదన వ్యక్తం చేసింది.

తీవ్ర నిరాశలో ఉన్న నాకు అమ్మ చెప్పిన మాటలు కొత్త ఊపిరిని పోశాయి. ‘నీ గురించి ప్రజలు ఇంత సమయాన్ని వృధా చేసుకుంటున్నారంటే నువ్వు ఎదిగావని అర్థం. హీరోయిన్ అవ్వడం అంత సామాన్యం కాదు, ఈ ఫేమ్ అందరికీ రాదు అని అమ్మ నచ్చజెప్పడంతో ధైర్యం తెచ్చుకుని ట్రోలింగ్‌ని పట్టించుకోవడం మానేశా. క్రమంగా ట్రోల్స్‌ను ఎలా డీల్ చేయాలో నేర్చుకున్నా’ అంటూ శ్రీలీల చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను ఎటువంటి విమర్శలనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని సంపాదించుకున్నానని ఈ డ్యాన్సింగ్ క్వీన్ స్పష్టం చేసింది.

 

  Last Updated: 23 Mar 2026, 10:40 AM IST