Jawan: పుష్ప మూవీని మూడు సార్లు చూశాను, షారుక్ ఇంట్రస్టింగ్ ట్వీట్!

బాలీవుడ్ హీరో షారుక్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించారు.

  • Written By:
  • Updated On - September 14, 2023 / 05:27 PM IST

Jawan: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నటించిన జవాన్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. రోజురోజుకు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లను నమోదు చేస్తోంది. లక్షలాది మంది కింగ్ ఖాన్ అభిమానులతో పాటు, భారతదేశంలోని అనేక మంది సెలబ్రిటీలు కూడా జవాన్ సినిమా చూసేందుకు ఇష్టపడుతున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న తెలుగు నటుడు అల్లు అర్జున్, షారుఖ్, జవాన్ మూవీని ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు.

అల్లు అర్జున్ ట్వీట్‌కి ప్రతిస్పందనగా షారుఖ్ ఇలా అన్నాడు. ‘ది ఫైర్’ స్వయంగా నన్ను పొగిడుతుంది. నేను మూడు రోజుల్లో పుష్పను మూడుసార్లు చూశాను. నేను మీ నుండి ఏదో నేర్చుకున్నా. మీకు బిగ్ హగ్. నిన్ను ప్రేమిస్తున్నా అంటూ రియాక్ట్ అయ్యాడు. ఇద్దరు సూపర్ స్టార్స్ ఒకరి గురించి మరొకరు ప్రశంసించుకోవడం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇక రీసెంట్ గా వచ్చిన “జవాన్” సెన్సేషనల్ హిట్ కాగా దీనిపై అల్లు అర్జున్ మరియు సంగీత దర్శకుడు అనిరుద్ మధ్య జరిగిన ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నాకు ఒక్క థాంక్స్ మాత్రమే కాదు మంచి పాటలు కూడా కావాలి అని అల్లు అర్జున్ ఇచ్చిన రిప్లైతో అయితే బన్నీ అనిరుద్ కాంబో కన్ఫర్మ్ కాగా ఇది దర్శకుడు అట్లీ తోనే సంభవం అని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. మరి ఈ మాసివ్ కాంబినేషన్ పై రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది.

Also Read: KTR: అమెరికా పోలీసులపై కేటీఆర్ ఫైర్, ఎందుకంటే