Jr. NTR Loses Cool: దక్షిణాది సినీ పరిశ్రమలో టాప్ స్టార్‌గా వెలుగొందుతున్న జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయనను ఒక్కసారి చూడటం కోసం అభిమానులు ఎంతటి సాహసానికైనా సిద్ధపడతారు. అయితే ఇటీవల ఒక ఆసుపత్రి ప్రారంభోత్సవానికి హాజరైన ఎన్టీఆర్ అక్కడ జరిగిన గందరగోళం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు కోపడ్డారు?
ఆదివారం బెంగళూరులోని IMS సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన రాకతో ఈవెంట్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడటంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. అభిమానులను అదుపు చేయడానికి పోలీసులు ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపు తప్పింది.
Also Read: ఐపీఎల్ 2026 షెడ్యూల్.. కీలక విషయాలివే!
Jr NTR | மேடையில் பேசும் போது ரசிகர்கள் சொன்ன அந்த வார்த்தை.. சட்டென டென்ஷன் ஆன ஜூனியர் என்டிஆர் #jrntr | #thanthitv | #cinema pic.twitter.com/48ne2DmPtP
— Thanthi TV (@ThanthiTV) March 9, 2026
వేదికపై నుండి మందలించిన ఎన్టీఆర్
వేదికపైకి వచ్చిన ఎన్టీఆర్.. అభిమానుల రచ్చ చూసి తీవ్రంగా అసహనానికి గురయ్యారు. ఆయన ప్రసంగించడానికి ప్రయత్నిస్తున్నా ప్రేక్షకులు నిరంతరం ఆయన పేరును పిలుస్తూ కేకలు వేయడం మొదలుపెట్టారు. దీనివల్ల ప్రసంగించడం కష్టంగా మారడంతో ఆయన తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి, అక్కడి వారందరినీ శాంతంగా ఉండమని కోరారు.
ఆయన సీరియస్‌గా స్పందిస్తూ.. మొదట తెలుగులో “దయచేసి అందరూ కాస్త నిశ్శబ్దంగా ఉంటారా?” అని అడిగారు. అయినా అభిమానులు వినకపోవడంతో కోపంగా ఇంగ్లీష్‌లో “నేను చెప్పాను కదా, నిశ్శబ్దంగా ఉండండి (I said keep quiet)” అని గట్టిగా హెచ్చరించారు. ఎన్టీఆర్ స్పందించిన తీరుతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు. ఆ తర్వాత ఆయన అందరికీ ధన్యవాదాలు తెలిపి తన ప్రసంగాన్ని కొనసాగించారు. సెలబ్రిటీల పట్ల అభిమానం ఉండటం సహజమే అయినా ఇలాంటి కార్యక్రమాల్లో క్రమశిక్షణ పాటించాలని నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు.
