Site icon HashtagU Telugu

Raasi: ప్రభాస్ అంటే చాలా ఇష్టం, ఆయనతో నటించాలనేది నా కోరిక : హీరోయిన్ రాశి

Raasi

Raasi

సీనియర్ హీరోయిన్ రాశి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. బాలనటిగా తెరంగేట్రం చేసి అగ్ర హీరోలందరి సరసన నటించింది. గోకులంలో సీతతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ తర్వాత పెళ్లి చేసుకున్న రాశి కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రాశి.. చాలా సినిమాల్లో కనిపించింది.

రీఎంట్రీ ఇచ్చిన రాశి సినిమాలతో పాటు సీరియల్స్‌లోనూ నటించింది. జానకి కలగనలేదు సీరియల్ రాశికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ఈ సీరియల్ చివరి దశకు చేరుకుంది. ఈ సందర్భంగా నటీనటులందరూ యూట్యూబ్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా రాశి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో తన ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో శోభన్ బాబు, చిరంజీవి అని ఆమె వెల్లడించింది. అయితే ప్రస్తుతం తనకు యంగ్ హీరోల్లో ప్రభాస్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. అతనితో నటించేందుకు చాలా ఆసక్తిగా ఉందని  తెలిపింది.

రాశి మాట్లాడుతూ.. ‘నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ఆయనతో నటించాలనేది నా కోరిక. హీరోయిన్‌గా కూడా నటిస్తుంది. తల్లి వంటి పాత్రలను నేను అంగీకరించను. ఇప్పటివరకు నేను ప్రభాస్‌తో మాట్లాడలేదు. అడవి రాముడు షూటింగ్ సమయంలో మేం ఒకే హోటల్‌లో బస చేశాం. అది తెలిసి ఎగిరి గంతేశాను. అయితే ప్రభాస్‌ని కలవాలనుకున్నాను. కానీ కుదరలేదు. కానీ ప్రభాస్ సీనియర్లకు చాలా గౌరవం ఇస్తారని విన్నాను.’ అని చెప్పింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read: Bhakta Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘భక్త కన్నప్ప’ షురూ

Exit mobile version