Actress Raasi: ఆ హీరో అంటే చెప్పలేనంత ఇష్టం.. ఆయన పక్కన అలా నటించను.

Prabhas  సీనియర్ నటి రాశి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో గ్లోబల్ స్టార్ ప్రభాస్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ప్రభాస్ మొదటి సినిమా ‘ఈశ్వర్’ ట్రైలర్ చూసినప్పుడే ఆయన పెద్ద స్టార్ అవుతారని తాను గుర్తించానని రాశి తెలిపారు. ఒకవేళ భవిష్యత్తులో ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తే అక్క లేదా వదిన పాత్రలకైనా సిద్ధమే కానీ, అమ్మ పాత్రలో మాత్రం నటించనని ఆమె స్పష్టం చేశారు. తమ ఇద్దరి వయస్సు దాదాపు ఒక్కటే కావటం దీనికి […]

Published By: HashtagU Telugu Desk
Actress Raasi

Actress Raasi

Prabhas  సీనియర్ నటి రాశి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో గ్లోబల్ స్టార్ ప్రభాస్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ప్రభాస్ మొదటి సినిమా ‘ఈశ్వర్’ ట్రైలర్ చూసినప్పుడే ఆయన పెద్ద స్టార్ అవుతారని తాను గుర్తించానని రాశి తెలిపారు. ఒకవేళ భవిష్యత్తులో ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తే అక్క లేదా వదిన పాత్రలకైనా సిద్ధమే కానీ, అమ్మ పాత్రలో మాత్రం నటించనని ఆమె స్పష్టం చేశారు. తమ ఇద్దరి వయస్సు దాదాపు ఒక్కటే కావటం దీనికి ప్రధాన కారణమని పేర్కొన్నారు.

బాలనటిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి హీరోయిన్‌గా తనదైన ముద్ర వేశారు నటి రాశి. ‘శుభాకాంక్షలు’, ‘గోకులంలో సీత’ వంటి చిత్రాలతో హోమ్లీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, గ్లామర్ పాత్రలతోనూ మెప్పించి అగ్ర కథానాయికగా ఎదిగారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, దాదాపు 200 పైగా చిత్రాల్లో నటించిన రాశి తాజాగా ఒక ఇంటర్వ్యూలో గ్లోబల్ స్టార్ ప్రభాస్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ప్రభాస్ మొదటి సినిమా ‘ఈశ్వర్’ విడుదలైనప్పుడే ఆయన రేంజ్ ఏంటో తాను ఊహించానని రాశి తెలిపారు. “ఆ సినిమా ట్రైలర్ చూడగానే.. ఇతను భవిష్యత్తులో చాలా పెద్ద హీరో అవుతాడు అని మా అన్నయ్యతో చెప్పాను. మాకు ఆ సెన్స్ ఉంటుంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, నడిచే విధానం, మ్యానరిజం నాకు చాలా ఇష్టం. బాహుబలి చూశాక ఆయనకు ఇంకా పెద్ద అభిమాని అయిపోయాను. ఆయన సినిమాలు మిస్ కాకుండా థియేటర్ కి వెళ్లి చూస్తాను” అని రాశి పేర్కొన్నారు.

ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం గురించి రాశి మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన కండిషన్ పెట్టారు. “నేను చాలా మందికి హీరోయిన్‌గా చేశాను. ప్రభాస్‌తో హీరోయిన్‌గా చేసే అవకాశం ఇప్పుడు ఎలాగో రాదు. ఆ కల అలాగే ఉండిపోయింది. కానీ, భవిష్యత్తులో ఆయనతో నటించాల్సి వస్తే.. నన్ను మేడం అని పిలిచినా, అక్క, వదిన అని పిలిచినా పర్వాలేదు కానీ, అమ్మ అని మాత్రం పిలవద్దు. ఎందుకంటే మా ఇద్దరి ఏజ్ ఫ్యాక్టర్ దాదాపు ఒకటే ఉంటుంది. ఆయనకు అమ్మగా నటించడం నాకు ఇష్టం లేదు” అని ఆమె మనసులోని మాట బయటపెట్టారు. ప్రభాస్‌ను ఇప్పటివరకు తాను వ్యక్తిగతంగా కలవలేదని, కానీ ఆయన నటించిన ‘మిర్చి’, ‘రాధే శ్యామ్’ చిత్రాల్లో ప్రభాస్ తల్లి పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పానని రాశి వెల్లడించారు.

రాశి కెరీర్ ఎంతో వైవిధ్యంగా సాగింది. బాలనటిగా బాల గోపాలుడు, ‘పల్నాటి పౌరుషం’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె 1997లో హీరోయిన్‌గా మారి వరుస విజయాలను అందుకున్నారు. ‘శుభాకాంక్షలు’, ‘పెళ్లి పందిరి’, ‘ప్రేయసి రావే’ వంటి చిత్రాలు ఆమెను స్టార్‌గా నిలబెట్టాయి. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ‘నిజం’ సినిమాలో చేసిన నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర తన కెరీర్‌ను దెబ్బతీసిందని, ఆ తర్వాత అవకాశాలు తగ్గాయని ఆమె నిజాయితీగా అంగీకరించారు. వివాహం తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన రాశి, ప్రస్తుతం బుల్లితెరపై పలు సీరియల్స్‌లో నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నారు. ప్రభాస్ పట్ల తనకున్న అభిమానాన్ని గౌరవప్రదంగా చాటుకుంటూనే, తన పాత్రల పట్ల స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన రాశి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

  Last Updated: 25 Mar 2026, 12:38 PM IST