Site icon HashtagU Telugu

PV Sindhu : విజయ్ దేవరకొండ సినిమాలు నచ్చవని చెప్పిన పివి సింధు..!

I Didnot Like Vijay Devarakonda Few Movies Says P V Sindhu

I Didnot Like Vijay Devarakonda Few Movies Says P V Sindhu

P V Sindhu స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు తెలుగు సినిమాల మీద ఆమెకు నచ్చిన విషయాల మీద రీసెంట్ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. స్టార్ బ్యాడ్మింటన్ గా సూపర్ పాపులర్ అయిన ఆమె ఇండియాకు ఎన్నో పతకాలను తెచ్చారు. ఇక రీసెంట్ గా ఆమె ఓ ఇంటర్వ్యూలో తనకు నచ్చిన హీరోల గురించి చెప్పుకొచ్చారు. తనకు ప్రభాస్ అంటే ఇష్టమని. ఆయన సినిమాలన్నీ చూస్తానని చెప్పారు పివి సింధు.

ప్రభాస్ అంటే ఇష్టం కానీ ఆయన్ను ఇప్పటివరకు కలవలేదని.. ఆ ఛాన్స్ ఇప్పటివరకు రాలేదని అన్నారు. తనకు రాం చరణ్ కూడా ఇష్టమని. అయితే చరణ్ ని కలిశానని అన్నారు. యువ హీరోల్లో తాను విజయ్ దేవరకొండ సినిమాలు చూస్తానని అయితే తను చేసిన సినిమాల్లో కొన్ని నచ్చనివి కూడా ఉన్నాయని అన్నారు పివి సింధు.

విజయ్ దేవరకొండ సినిమాల్లో నచ్చనివి ఏంటన్నది మాత్రం ఆమె చెప్పలేదు. ఇక తనకు సినిమాల్లో నటించే ఆలోచన లేదని. తన పూర్తి ఫోకస్ ఆట మీదే ఉంది. అయితే తన బయోపిక్ చేస్తే అందులో దీపిక పదుకొనె అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందని పివి సింధు అన్నారు. మొత్తానికి విజయ్ దేవరకొండ సినిమాలు నచ్చవని చెప్పి అందరిని షాక్ అయ్యేలా చేశారు పివి సింధు.

Also Read : Samantha : విశ్వంభర ఛాన్స్ మిస్ చేసుకున్న సమంత.. ఆమె ప్లేస్ లో ఆ హీరోయిన్ ని తీసుకున్నారా..?