Site icon HashtagU Telugu

Swetha Naidu: తల్లిదండ్రుల ముందు కన్నీరు పెట్టుకున్న శ్వేతా నాయుడు.. స్టేజ్ పై అలా!

F3e52ea9 6537 43ab 8759 2a8ba8c73628

F3e52ea9 6537 43ab 8759 2a8ba8c73628

తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల ఎంటర్టైన్మెంట్ షోలో ప్రదర్శితం అవుతున్న విషయం తెలిసిందే. కామెడీ షోల తో పాటు డాన్స్ షోలు కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి. ఒకవైపు కామెడీ షోలు మరోవైపు డ్యాన్స్ షోలు బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అదిరిపోయే డ్యాన్స్ పెర్ఫామెన్స్ లతో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీకి కూడా ఢీ షో అడ్డా అవుతోంది. ఈ మధ్యకాలంలో ఢీ షోలో డ్యాన్స్ లతో పాటు కామెడీ కూడా ఉంటోంది. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు ఢీషోలో జబర్దస్త్ ని మించి కామెడీ ఉంటోంది.

We’re now on WhatsApp. Click to Join
ఇకపోతే బుల్లితెరపై సూపర్ క్రేజ్ ని సొంతం చేసుకున్న వారిలో హైపర్ ఆది ఢీ లాంటి డ్యాన్స్ షోలో సైతం సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈటీవీలో ఢీ సెలబ్రిటీ స్పెషల్ షో జరుగుతోంది. ఈ షోకి నందు యాంకరింగ్ చేస్తున్నారు. జానీ మాస్టర్, గణేష్ మాస్టర్, ప్రణీత సుభాష్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఢీ సెలెబ్రిటీ షో ఉగాదికి ముస్తాబవుతోంది. తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. ఈ షోలో డ్యాన్సర్ లతో వారి తల్లి దండ్రులు కూడా హాజరయ్యారు. దీనితో ఢీ షో ఎమోషనల్ గా మారింది. ఇంత ఎమోషనల్ గా సాగిన షోలో కూడా హైపర్ ఆది తనదైన శైలిలో కామెడీతో అలరించారు.

Also Read: Nayanthara : అర్ధరాత్రి రోడ్డుపై అలాంటి పని చేస్తున్న నయనతార.. వీడియో వైరల్!

డ్యాన్సర్ల తల్లి దండ్రులని హైపర్ ఆది పరిచయం చేసుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా హైపర్ ఆది.. ఢీ షోతో పాపులర్ అయిన యంగ్ డ్యాన్సర్ శ్వేతా నాయుడు తల్లిదండ్రులని టార్గెట్ చేశాడు. కెలుక్కుని మరీ పరువు పోగొట్టుకున్నాడు. శ్వేతాకి పెళ్లి ఎప్పుడు చేస్తున్నారు అని హైపర్ ఆది ఆమె తల్లిదండ్రులని అడిగాడు. ఆమె తండ్రి మంచి అబ్బాయి దొరికితే చేస్తాం అని అన్నారు. అంటే నేనొచ్చి అడుగుతున్నాను. నేను మంచి అబ్బాయిని కాదా అని ప్రశ్నించాడు. పక్కనే ఉన్న వ్యక్తి ఏంటి నీకు ఇంకా పెళ్లి కాలేదా అంటూ హైపర్ ఆది పరువు తీశాడు. ఆ తర్వాత డ్యాన్సర్లు అంతా అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చారు.

Also Read: Ajith Kumar: షూటింగ్ లో హీరో అజిత్ కారుకు యాక్సిడెంట్.. నెట్టింట వీడియో వైరల్!

శ్వేతా నాయుడు మాత్రం శ్యామ్ సింగరాయ్ చిత్రంలోని ధీమ్ తానా ధీమ్ ధీమ్ తానా జతులతో అనే సాంగ్ కి క్లాసికల్ డ్యాన్స్ ను ఇరగదీసింది. ఎప్పుడూ మోడ్రన్ డ్యాన్సులతో అలరించే శ్వేతా నాయుడు ఇలా క్లాసికల్ డ్యాన్స్ చేయడంతో అంతా షాక్ అయ్యారు. గణేష్ మాస్టర్ మాట్లాడుతూ.. శ్వేతా ఇప్పటి వరకు చేసిన డ్యాన్స్ మొత్తం ఒకెత్తు ఈ క్లాసికల్ డ్యాన్స్ మాత్రం మరో ఎత్తు అని ప్రశంసించారు. తన తల్లిదండ్రుల ముందు క్లాసికల్ డ్యాన్స్ చేయడం చాలా ఆనందంగా ఉందంటూ శ్వేతా కన్నీరు మున్నీరుగా ఏడ్చేసింది. ఆమె తల్లిదండ్రులు వేదికపైకి వెళ్లి ఓదార్చారు. ఆమెని ఎంకరేజ్ చేస్తూ హైపర్ ఆది చెప్పిన మాట హైలైట్ అనే చెప్పాలి.

Exit mobile version