Hyper Aadi : రోజా అంటే ఎప్పుడు గౌరవమే – హైపర్ ఆది

రోజాకు జగన్ అంటే ఇష్టం, నాకు పవన్ అంటే ఎక్కువ ఇష్టం. ఎవరి ఇష్టాలు వారివి, ఆమె అంటే నాకు ఎప్పుడూ గౌరవమే ఉంటుంది

Published By: HashtagU Telugu Desk
Hyper Roja

Hyper Roja

హైపర్ ఆది (Hyper Aadi) ..ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచమైన అది..అతి తక్కువ టైంలోనే టాప్ కమిడియన్ గా మారిపోయారు. కేవలం బుల్లితెర ఫై మాత్రమే కాదు వెండి అభిమానులను సైతం అలరిస్తూ వస్తున్నాడు. అలాగే సినీ నటుడు , జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అంటే కూడా ఎంతో ఇష్టం. తన స్కిట్ లలోనే కాదు బయట కూడా పవన్ కళ్యాణ్ ఫై తనకున్న అభిమానం , ప్రేమను ఎప్పటికప్పుడు చాటుకుంటూ రావడమే కాదు ఆయనపై ఎవరైనా విమర్శలు చేస్తే అదే రీతిలో కౌంటర్లు ఇస్తుంటాడు. ఇక ఏపీ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ తరుపున విస్తృతంగా ప్రచారం చేసి..పార్టీ విజయంలో భాగం అయ్యారు. అయితే రాజకీయంగా రోజా (RK Roja) ఫై విమర్శలు చేసినప్పటికీ..వ్యక్తిగతంగా ఆమె అంటే ఎంతో గౌరవం అని తాజాగా మరోసారి చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎన్నికల ఫలితాల తర్వాత రోజాపై మీ అభిప్రాయం ఏంటని ఓ ఇంటర్వ్యూ లో సదరు యాంకర్ ఆదిని ప్రశ్నించగా, ఆ ప్రశ్నకు ఆయన మాట్లాడుతూ.. రోజాకు జగన్ అంటే ఇష్టం, నాకు పవన్ అంటే ఎక్కువ ఇష్టం. ఎవరి ఇష్టాలు వారివి, ఆమె అంటే నాకు ఎప్పుడూ గౌరవమే ఉంటుంది. నాకు ఇంత పేరు రావడానికి ఆమె కూడా ఓ కారణమని ఆది చెప్పుకొచ్చాడు.రాజకీయాలకు అతీతంగా ఆమెపై నాకు గౌరవం ఎప్పుడు ఉంటుందని తెలిపాడు. ప్రస్తుతం ఆది రోజాపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Read Also : Manorama Khedkar: మనోరమ ఖేద్కర్‌ జైలు నుంచి పరుగో పరుగు

  Last Updated: 03 Aug 2024, 10:41 PM IST