Rakesh Roshan : కరోనా తర్వాత నుంచి సౌత్ సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సౌత్ సినిమాల సక్సెస్ తట్టుకోలేకపోతుంది. కంగనా రనౌత్, అనురాగ్ కశ్యప్.. లాంటి కొంతమంది మాత్రం సౌత్ సినిమాలను అభినందిస్తున్నారు. కొంతమంది అయితే పుష్ప 2 ఈవెంట్ కి భారీగా వచ్చిన జనాల్ని చూసి, పుష్ప 2 భారీ సక్సెస్ తట్టుకోలేక సౌత్ సినిమాలపై విమర్శలు కూడా చేస్తున్నారు.
ఇటీవల నాగవంశీ బాలీవుడ్ సినిమాల గురించి ఉన్న మాటే అంటే చాలామంది బాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు నాగవంశీ పై మాటలతో అటాక్ చేశారు. సౌత్ సినిమాలంటేనే కొంతమంది బాలీవుడ్ వాళ్ళు కుళ్ళుకునే స్థాయికి వచ్చేసారు. తాజాగా హృతిక్ రోషన్ తండ్రి, సీనియర్ నటుడు, దర్శకుడు రాకేష్ రోషన్ సౌత్ సినిమాలపై కామెంట్స్ చేసాడు.
రాకేష్ రోషన్ ఓ ఇంటర్వ్యూలో సౌత్ సినిమాల గురించి మాట్లాడుతూ.. సౌత్ సినిమాలు గ్రౌండ్ లెవల్లో సింపుల్ గా ఉంటాయి. ఆ సినిమాలు అదే పాత పద్దతిలోనే ఉంటాయి. పాటలు, యాక్షన్, డైలాగ్స్, ఎమోషన్స్.. ఇలా పాత పద్దతిలోనే సాగుతాయి వాళ్ళ సినిమాలు కొత్తగా ట్రై చేయాలని చూడరు. ఆ పాత మార్గాన్నే కొనసాగిస్తున్నారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు అని అన్నారు. అలాగే తను ఒక లవ్ స్టోరీ తీసిన తర్వాత ఇంకో కొత్త కథతో చేశాను ఒకే రకం సినిమాలు చేయలేదు అని అన్నారు.
ఇండైరెక్ట్ గా సౌత్ వాళ్ళు ఒకేరకమైన సినిమాలు చేస్తున్నారు, కొత్తగా ట్రై చేయట్లేదని రాకేష్ రోషన్ అన్నారు. దీంతో రాకేష్ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా పలువురు సౌత్ ప్రేక్షకులు ఆయనపై విమర్శలు చేస్తున్నారు.
Also Read : Jagapathi Babu : సైలెంట్ గా చరణ్ RC16 షూటింగ్.. కొత్త లుక్ కోసం కష్టపడుతున్న జగపతి బాబు..