Site icon HashtagU Telugu

Hrithik Roshan NTR Natu Natu : వార్ 2లో మరో నాటు నాటు.. అదే నిజమైతే కెవ్వు కేక..!

NTR Hrithik Roshan Dance Choreography by Vaibhavi Merchant

NTR Hrithik Roshan Dance Choreography by Vaibhavi Merchant

Hrithik Roshan NTR Natu Natu వార్ సినిమాకు సీక్వల్ గా బాలీవుడ్ మేకర్స్ వార్ 2 తెరకెక్కిస్తున్నారు. హృతిక్ రోష, టైగర్ ష్రాఫ్ నటించిన వార్ సినిమా సీక్వల్ లో టాలీవుడ్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా భాగం అవుతున్నాడు. హృతిక్ రోష,  ఎన్టీఆర్ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకుంటున్న వార్ 2 సినిమాను అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమాకు సంబందించి హృతిక్ రోషన్ పోర్షన్ కొంత షూట్ చేశారు. ఇక లేటెస్ట్ గా ఈ మూవీ షూటింగ్ లో తారక్ పాల్గొన్నాడు.

ఎన్టీఆర్, హృతిక్ కలిసి ఒక ఇంపార్టెంట్ షెడ్యూల్ లో భాగం అవుతున్నారు. అయితే వార్ 2 గురించి ఇప్పటికే తారాస్థాయి అంచనాలు ఏర్పడగా ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ ఫ్యాన్స్ ని మరింత సర్ ప్రైజ్ చేస్తుంది. బాలీవుడ్ లో డ్యాన్స్ తో అదరగొట్టే హృతిక్ మన ఎన్టీఆర్ తో కలిసి ఒక అదిరిపోయే డ్యాన్స్ నెంబర్ ప్లాన్ చేస్తున్నారట. అది దాదాపు RRR సినిమాలో నాటు నాటు సాంగ్ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది.

RRR సినిమాలో నాటు నాటు సాంగ్ ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ సాంగ్ ని మించిపోయేలా వార్ 2 లో సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. బ్రహ్మాస్త్ర టైం లోనే అయాన్ ముఖర్జీ డైరెక్షన్ టాలెంట్ గురించి రాజమౌళి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. సో వార్ 2 లో హృతిక్, ఎన్టీఆర్ లను అయాన్ ఎలా చూపించబోతున్నాడో అని ఆడియన్స్ లో సూపర్ ఎగ్జైట్మెంట్ మొదలైంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ రా (RAW) ఏజెంట్ గా కనిపించనున్నాడు. సినిమాలో కియరా అద్వాని ఒక హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుండగా సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఎవరికి వస్తుందా అని చర్చ జరుగుతుంది.

Also Read : Improve Digestion: మీరు మీ జీర్ణక్రియను బలోపేతం చేయడానికి తాగాల్సిన పానీయాలు ఇవే..!