ప్రస్తుతం ఉన్న దర్శకులు గ్రాఫిక్స్(Graphics) తో వెండితెరపై వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. అయితే గ్రాఫిక్స్ లేని సమయంలోనే సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు(Singeeham Srinivasa Rao) ఎన్నో వండర్స్ క్రియేట్ చేశారు. భైరవద్వీపం, ఆదిత్య 369, విచిత్ర సోదరులు వంటి సినిమాలు తీసి అదరహో అనిపించారు. కాగా విచిత్ర సోదరులు(Vichitra Sodarlu) సినిమాలో కమల్ హాసన్(Kamal Haasan) రెండు డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తాడు. ఒకటి అందరిలా హైట్ గా కనిపించే వ్యక్తి, మరొకటి పొట్టిగా ఉన్న పాత్ర. అయితే గ్రాఫిక్స్ లేని టైములో ఈ పొట్టి కమల్ హాసన్ ని ఎలా చూపించారు అన్నది ఇప్పటికి చాలామందికి ఉన్న డౌట్.
ఈ ప్రశ్నకు సింగీతం శ్రీనివాసరావే ఒక సందర్భంలో బదులిచ్చారు. లాంగ్ షాట్స్ లేనివి, క్లోజప్ షాట్స్ ని కమల్ హాసన్ ని నార్మల్ గా పెట్టి నడుము వరకు లేదా ఫేస్ కి షాట్ పెట్టి తీసేవాళ్ళు. ఇక లాంగ్ షాట్స్ లోనే అసలు కష్టం వచ్చి పడింది. అందుకు కమల్ హాసన్ చాలా కష్టపడ్డాడట. కమల్ ని పొట్టివాడిగా చూపించేందుకు మొక్కలపై నిలబెట్టి షూట్ చేసేవాళ్లు. ఇక ఆ మోకాళ్ళు పట్టేలా 18 అంగుళాల తేలికపాటి షూస్ ని ప్రత్యేకంగా తయారు చేయించారట. కమల్ హాసన్ పూర్తి కాలు పట్టేలా ఆ షూ వెనుక భాగం ఓపెన్ గా ఉండేలా రెడీ చేయించారు. ఇక నెల మీద ఒకే చోట ఉన్న సమయంలో అయితే కమల్ కాళ్లను భూమి లోపల పాతిపెట్టేవారు.
బల్లపై నటించే సీన్ లో కమల్ హాసన్ కాళ్లను వెనక్కి మడిచి పైకి లేపి కట్టేవారట. అలాగే కొన్ని సీన్స్ లో కమల్ కాళ్ళని పూర్తిగా కవర్ చేసి నడుము దగ్గర నుంచి కృత్రిమ కాళ్లను అమర్చి.. వాటిని ఒక వైరు సహాయంతో ఊపుతూ చూపించేవారట. అంతే కాదు ఇలా పొట్టిగా చూపించేందుకు ఒక ప్రత్యేక సోఫాని కూడా కొన్ని సీన్స్ లో తయారు చేయించారు. పొట్టి కమల్ హాసన్ గా రీటేక్‌లు కూడా లేకుండా సీన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచేవాడట. ఇలా పొట్టిగా కనిపించడంలో కమల్ హాసన్ ఎంత కష్టపడ్డాడో, జపాన్ అనే సెట్ బాయ్ కూడా కమల్ ని అలా చూపించడానికి అంతే కష్టపడేవాడట. అందుకనే ఈ మూవీ సిల్వర్ జూబ్లీలో ఫంక్షన్ లో కమల్ హాసన్ మాట్లాడుతూ.. జపాన్ అనే వ్యక్తి లేకుంటే విచిత్ర సోదరులు సినిమా లేదు అని చెప్పారు.
Also Read : Varun Tej : నాలుగు నెలల్లో రెండు సినిమాలు రిలీజ్.. మరో పక్క పెళ్లి కూడా.. ఫుల్ బిజీగా వరుణ్ తేజ్..