Actor Sahil Khan : సాహిల్ ఖాన్ పరుగో పరుగు.. తప్పించుకునేందుకు 4 రోజుల్లో 1800 కి.మీ జర్నీ !

Actor Sahil Khan : మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ ఇటీవల అరెస్టయ్యాడు. 

  • Written By:
  • Updated On - April 29, 2024 / 12:06 PM IST

Actor Sahil Khan : మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ ఇటీవల అరెస్టయ్యాడు.  అయితే ఆయన అరెస్టు కావడానికి ముందు చాలా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి సాహిల్ ఖాన్ చాలా చక్కర్లు కొట్టారట. ఆయన నాలుగు రోజుల వ్యవధిలో  ఐదు రాష్ట్రాలకు వెళ్లి తలదాచుకునే ప్రయత్నం చేశారట. ఇందుకోసం  దాదాపు 1,800 కి.మీ దూరాన్ని సాహిల్ ఖాన్ ప్రయాణించారట. చివరకు ఆయనను శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో అరెస్టు చేశారు.

We’re now on WhatsApp. Click to Join

తొలుత సాహిల్ ఖాన్(Actor Sahil Khan) మహారాష్ట్ర నుంచి గోవాకు.. గోవా నుంచి కర్ణాటకలోని హుబ్బళ్లికి వెళ్లారు. అనంతరం హుబ్బళ్లి నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. ఈక్రమంలో తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ఆయన మారువేషాన్ని ధరించారట. నిరాడంబరమైన దుస్తులు వేసుకున్నారట. కండువా కప్పుకొని తన మొహాన్ని ఎవరూ చూడకుండా జాగ్రత్తపడ్డారట. చివరకు సాహిల్ ఖాన్ హైదరాబాద్‌లో ఉండగా పోలీసులు ఆయన లొకేషన్‌ను ట్రాక్ చేశారు. దీంతో అలర్ట్ అయిన సాహిల్ ఖాన్.. హడావుడిగా ఛత్తీస్‌గఢ్ వైపు పారిపోయాడు. ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంలో రాత్రి సమయంలో సాహిల్ ఖాన్ కారులో జర్నీ చేశాడు.  ఈసమయంలో జగదల్‌పూర్‌లోని ఆరాధ్య ఇంటర్నేషనల్ హోటల్‌లో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.  ముంబై పోలీసులు మొత్తం మీద  72 గంటల పాటు సాహిల్  ఖాన్‌ లొకేషన్‌ను ట్రాక్ చేశారు. వారు అందించిన సమాచారం మేరకే జగదల్‌పూర్‌ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సాహిల్ నుంచి పోలీసులు రెండు మొబైల్ ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు ముంబై కోర్టు మే 1 వరకు పోలీసు కస్టడీ విధించింది.’స్టైల్’, ‘ఎక్స్‌క్యూస్ మీ’ వంటి హిందీ చిత్రాలలో సాహిల్ ఖాన్ నటించారు.

Also Read :Lok Sabha Segments : ఐదు లోక్‌సభ సెగ్మెంట్లకు కో-ఇన్‌ఛార్జ్‌ల నియామకం.. కీలక నేతలకు ఛాన్స్

మహాదేవ్ బెట్టింగ్ యాప్ అంటే ?

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సౌరభ్ చంద్రకర్, దుబాయ్‌కి చెందిన రవి ఉప్పల్‌లు కలిసి మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ నడుపుతున్నారు. ఇందులో IPL మ్యాచ్‌లు, ఫుట్‌బాల్, టెన్నిస్, ఇతర క్రీడా ఈవెంట్‌ల ఫలితాలపై బెట్టింగ్‌లు నిర్వహిస్తుంటారు. ఈ యాప్ వైపు ప్రజలను లాగేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో యాడ్స్ ఇస్తుంటారు. ఈ యాడ్‌లలో నటులు రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్, తమన్నా భాటియాలతో సాహిల్ ఖాన్ నటించారు. వీరందరికి కూడా ఇప్పటికే సమన్లు ​​అందాయి.

Also Read :Nikhil Siddhartha : జనసేన జెండా పట్టిన హీరో నిఖిల్.. వీడియో వైరల్..