Site icon HashtagU Telugu

Samyuktha Menon: విరూపాక్షతో గ్లామర్ డోసు పెంచిన సంయుక్త.. ఆ షాట్‌లో సెక్సీగా!

Virupaksha

Virupaksha

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం విరూపాక్ష (Virupaksha) విడుదలకు సిద్ధమవుతోంది. మిస్టీరియస్, థ్రిల్లింగ్ అంశాల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. అయితే ఇటీవల విడుదలైన విరుపాక్ష ట్రైలర్ (Trailer) అందర్నీ ఆకట్టుకుంటోంది. ఓ సీన్ లో అందరి కళ్లు హీరోయిన్ సంయుక్తా మీనన్ (Samyuktha Menon) పై పడుతాయి. ట్రైలర్ లోని ఓ షాట్ లో తన అందాలను ఒలకబోస్తోంది. ఎద అందాలను చూపుతూ ఆకట్టుకుంది. అయితే ఇది వరకు సినిమాలతో పోలిస్తే విరుపాక్ష మూవీతో గ్లామర్ డోసు (Bold Scene) పెంచింది ఈ బ్యూటీ. సంయుక్తా మీనన్ తక్కువ కాలంలోనే వరుస సినిమా అవకాశాలను సొంతం చేసుకుంటోంది. ఆమె అమాయకపు చూపులు, హోమ్లీ గ్లామర్‌తో  తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశాయి.

ఇక బింబిసార, సార్ (Sir) సినిమాలు హిట్ కావడంతో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ముఖ్యంగా సర్‌లో లవ్లీ అండ్ లైవ్లీ మీనాక్షిగా ప్రేక్షకుల మనసు దోచింది. విరుపాక్ష మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ బ్యూటీ ట్రైలర్ తోనే అట్రాక్ట్ చేసింది. ట్రైలర్ లోని ఓ సీన్ లో ఆమె వెనుక నుండి సాయి తేజ్ చేత కౌగిలించుకున్న ఆ షాట్‌లో సంయుక్త చాలా సెక్సీగా (Sexy), అందంగా కనిపిస్తుంది. ట్రైలర్‌ని బట్టి చూస్తే, సంయుక్తకి కూడా కీలక పాత్ర ఉందని తెలుస్తోంది. సుకుమార్ బ్రాండ్ కారణంగా విరూపాక్ష మంచి ఓపెనింగ్ కలెక్షన్లు వచ్చే అవకాశాలున్నాయి. ఏప్రిల్ 21న సినిమా విడుదల కానుంది.

Also Read: KGF3 Update: రాకీభాయ్ మళ్లీ వస్తున్నాడు.. కేజీఎఫ్3 అప్ డేట్ ఇదిగో!