ఫ్యామిలీ స్టార్ సినిమా నిరాశ పరచడంతో తన ఫ్యాన్స్ కి సూపర్ హిట్ సినిమా ఇచ్చేందుకు కృషి చేస్తున్నాడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). ప్రస్తుతం గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ ఆ సినిమాతో ష్యూర్ షాట్ హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. సినిమా అవుట్ పుట్ కూడా చాలా సాటిస్ఫైడ్ ఆ వస్తుందని టాక్. ఇక మరోపక్క విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యన్ (Rahul Sankrityan) డైరెక్షన్ లో ఒక సినిమా ప్లానింగ్ లో ఉందని తెలిసిందే.
ఈ సినిమా పీరియాడికల్ మూవీగా భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా విషయంలో ఏమాత్రం తగ్గట్లేదని టాక్. ఐతే ఈ సినిమాలో విలన్ గా సౌత్ ఆఫ్రికా నటుడు హాలీవుడ్ యాక్టర్ ని తీసుకుంటున్నారని తెలుస్తుంది. హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ది మమ్మీ (Mummy), మమ్మీ రిటర్స్ లో నటించిన వోస్లో (Vosloo) ని వీడీ 14 సినిమాలో తీసుకుంటున్నారట.
హాలీవుడ్ అప్పీల్..
మేకర్స్ అతనితో చర్చలు నిర్వహించినట్టు తెలుస్తుంది. అతను ఓకే చెబితే మాత్రం విజయ్ దేవరకొండ సినిమాకు హాలీవుడ్ అప్పీల్ వచ్చినట్టే అని చెప్పొచ్చు. పాన్ ఇండియా వైడ్ గా భారీ రేంజ్ లో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. శ్యాం సింగ రాయ్ తో తన టాలెంట్ చూపించిన రాహుల్ ఈసారి నెక్స్ట్ లెవెల్ స్టోరీతో వస్తున్నాడని తెలుస్తుంది.
విజయ్ దేవరకొండ సినిమాల లైనప్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉంది. యువ హీరోల్లో ఎంతో క్రేజ్ సంపాదించిన విజయ్ దేవరకొండ అంతే నెగిటివిటీని కూడా పొందాడు. ఐతే అందరికీ తన మార్క్ సమాధానంగా రాబోయే సినిమాలతో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Also Read : Nikhil : పది నిమిషాలకో ట్విస్ట్.. క్లైమాక్స్ ఎవరు ఊహించలేరట..!