Site icon HashtagU Telugu

Hollywood Shut Down : హాలీవుడ్ షట్ డౌన్..1.60 లక్షల మంది యాక్టర్స్ సమ్మె

Hollywood Shut Down

Hollywood Shut Down

Hollywood Shut Down : ఈరోజు నుంచి హాలీవుడ్ షట్ డౌన్.. 

ఎందుకంటే గత 60 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా హాలీవుడ్ రచయితలు,  నటులు ఒకేసారి సమ్మెకు దిగారు..

తీవ్రమైన పనిభారం, వసతుల లేమి, అరకొర జీతభత్యాలు, కరువైన ఉద్యోగ భద్రత వంటి అంశాలపై మూవీస్, సీరియల్స్ లో నటించే  దాదాపు 1.60 లక్షల మంది నటులు ఆందోళనకు దిగారు.   

Also read : Acid Attack : యువతి కిడ్నాప్.. యాసిడ్ దాడి.. బావిలో మృతదేహం

హాలీవుడ్ నటులకు ప్రాతినిధ్యం వహిస్తున్న “స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్” సంస్థ ..  వాల్ట్ డిస్నీ, నెట్‌ఫ్లిక్స్  సహా ఇతర ప్రముఖ మూవీ స్టూడియోలకు ప్రాతినిధ్యం వహిస్తున్న “అలయన్స్ ఆఫ్ మోషన్ పిక్చర్ & టెలివిజన్ ప్రొడ్యూసర్స్‌”తో గురువారం రాత్రి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కొత్త కార్మిక ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు మూవీ స్టూడియోలు నో చెప్పాయి. దీంతో స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ సమ్మెకు(Hollywood Shut Down) పిలుపు ఇచ్చింది. ఇక హాలీవుడ్ మూవీ, సీరియల్ రైటర్స్ కు ప్రాతినిధ్యం వహించే “రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా” కూడా మే 2 నుంచి సమ్మెలోనే ఉంది. ఈవిధంగా దాదాపు హాలీవుడ్ అంతా సమ్మెబాట పట్టినట్టు అయింది. ఈ సమ్మె నేపథ్యంలో “ది టునైట్ షో” వంటి ప్రముఖ టీవీ ప్రోగ్రామ్‌ లు కూడా ఆగిపోయాయంటే హాలీవుడ్ లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Also read : Congress : “ప‌వ‌ర్” పాలిటిక్స్‌పై రంగంలోకి కాంగ్రెస్ హైక‌మాండ్‌.. డ్యామేజ్ కంట్రోల్‌లో అగ్ర‌నేత‌లు