నేచురల్ స్టార్ నాని తన సినీ ప్రయాణాన్ని అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభించినా, ‘అష్టాచమ్మా’తో హీరోగా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టి, తనదైన నటనతో విభిన్నమైన పాత్రల్లో మెరిసి అభిమానుల మనసు దోచుకున్నారు. ‘దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ వంటి హిట్‌లతో వరుసగా విజయాలు అందుకున్న నాని, ఈసారి మాత్రం తన మాస్ యాంగిల్‌కి ఒక వాయిలెంట్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘హిట్ 3’ సినిమాలో ఆయన పాత్ర, మేకోవర్ పూర్తిగా రఫ్, బోల్డ్ డైలాగ్స్‌తో కొత్తగా కనిపించాడు.
AP DGP : ఏపీ డీజీపీగా హరీశ్‌కుమార్ గుప్తా.. నేపథ్యమిదీ
సినిమా టాక్ విషయానికి వస్తే.. సినిమా ఫస్ట్ హాఫ్ బోల్డ్ డైలాగ్స్, విచారణ సన్నివేశాలతో నడవడంతో పాటు, నాని పెర్ఫార్మెన్స్ ఆకట్టుకునేలా ఉంది. అయితే మొదటి భాగం ఓ మాదిరిగా సాగుతుందని, ఇంటర్వెల్ తర్వాత ఆసక్తి పుంజుకుంటుందని టాక్ వినిపిస్తోంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా నిలుస్తాయని చెబుతున్నారు. మ్యూజిక్ మాత్రం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేదన్న ఫీడ్‌బ్యాక్ ఉంది. పాటలు స్పీడ్ బ్రేకర్లుగా అనిపించాయట.
సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా స్క్విడ్ గేమ్ తరహాలో ఉండి ప్రేక్షకుల్లో టెన్షన్, ఉత్కంఠను పెంచుతుందని అంటున్నారు. ప్రీ-క్లైమాక్స్ నుంచి సినిమా మళ్లీ పుంజుకుంటూ కట్టిపడేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. నాని అద్భుతమైన నటన, ఒక స్టార్ హీరోగా ఉన్నత స్థాయి పెర్ఫార్మెన్స్‌తో సినిమా మొత్తానికి బలాన్ని ఇచ్చినట్టు టాక్. ఓ సర్ప్రైజ్ కేమియో సెకండాఫ్‌లో రావడంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఓవరాల్ గా HIT 3 బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అంటున్నారు .