న్యాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్-3’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ మంజూరు చేసింది. అంటే 18 సంవత్సరాలు నిండినవారికే థియేటర్లలో వీక్షించే అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయం సినిమాలో కనిపించే హింసాత్మక దృశ్యాలు, సీరియస్ కంటెంట్‌ను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నట్లు తెలుస్తోంది.
సినిమా మొత్తం నిడివి 2 గంటల 37 నిమిషాలు 6 సెకన్లు కాగా, కొన్ని సన్నివేశాల్లో హింస అధికంగా ఉన్నందున సెన్సార్ బోర్డు కొన్ని మార్పులను సూచించింది. బూతు పదాల వాడకాన్ని కూడా పరిమితం చేయాలని చెప్పింది. అయితే ఈ అంశాలన్నీ సినిమా కథలో భాగంగా వస్తాయని, రీరిజినబుల్ స్థాయిలో ఉన్నాయని సమాచారం. సినిమా థ్రిల్లింగ్ న్యాయాన్వేషణ నేపథ్యంలో నడవడంతో, ప్రేక్షకుల ఉత్కంఠను పెంచే విధంగా తెరకెక్కించారని టాక్.
హిట్ సీక్వెల్ లో వస్తున్న మూడవ భాగం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మే 1న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటికే ట్రైలర్ ద్వారా ఆసక్తిని రేపింది. శైలేష్ కొలను మళ్ళీ ఓ డార్క్, ఇంటెన్స్ కథను తెరపై చూపించబోతున్నారని సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ‘హిట్-3’ ఎంతవరకు క్రైమ్ థ్రిల్లర్ అభిమానులను మెప్పిస్తుందో చూడాలి!