Payal Rajput : ఆ సినిమాలో ఛాన్స్ మిస్ అయింది.. ఎప్పటికైనా మహేష్ బాబుతో కలిసి నటిస్తా..

ఓ ఇంటర్వ్యూలో పాయల్ పలు ఆసక్తికర విషయాలని పంచుకుంటూ మహేష్(Mahesh Babu) సరసన ఓ సినిమా మిస్ అయిందని, అతనితో నటించాలనేది తన డ్రీమ్ అని చెప్పింది.

Published By: HashtagU Telugu Desk
Heroine Payal Rajput Miss the chance in Sarkaru Vaari Paata she wants to act with Mahesh Babu

Heroine Payal Rajput Miss the chance in Sarkaru Vaari Paata she wants to act with Mahesh Babu

RX100 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది పాయల్ రాజ్‌పుత్(Payal Rajput). పంజాబీలో వరుస సినిమాలు చేస్తూ తెలుగులో కూడా ఆఫర్స్ దక్కించుకుంటుంది ఈ ఢిల్లీ భామ. తెలుగులో ఇప్పటికే RDX లవ్, వెంకీ మామ, డిస్కో రాజా, తీస్ మార్ ఖాన్, జిన్నా.. లాంటి పలు సినిమాలతో మెప్పించింది. త్వరలో మరోసారి తనకి లైఫ్ ఇచ్చిన RX100 డైరెక్టర్ అజయ్ భూపతి(Ajay Bhupathi) దర్శకత్వంలోనే మంగళవారం అనే సినిమాతో రాబోతుంది పాయల్.

ఇటీవలే మంగళవారం సినిమా టీజర్ రిలీజయి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాయల్ పలు ఆసక్తికర విషయాలని పంచుకుంటూ మహేష్(Mahesh Babu) సరసన ఓ సినిమా మిస్ అయిందని, అతనితో నటించాలనేది తన డ్రీమ్ అని చెప్పింది.

పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ.. మహేష్ బాబు సరసన నటించాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ఆయన పక్కన నటించడం నా డ్రీమ్. సర్కారు వారి పాట సినిమాలో ఛాన్స్ కోసం చాలా ట్రై చేశాను. కానీ ఆ సినిమాలో ఛాన్స్ మిస్ అయింది. ఆ ఛాన్స్ కీర్తి సురేష్ కి వెళ్ళింది. కీర్తి ఆ సినిమాలో చాలా బాగా చేసింది. ఆ సినిమా ఛాన్స్ మిస్ అయినందుకు నేను చాలా బాధపడ్డాను. ఎప్పటికైనా మహేష్ బాబుతో నటిస్తాను, ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలి అని తెలిపింది. మరి ఈ అమ్మడి కోరిక విని ఏ డైరెక్టర్ అయినా మహేష్ సరసన ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి.

 

Ashish Vidyarthi : 58 ఏళ్ళ వయసులో రెండో భార్యతో హనీమూన్‌కి వెళ్లిన ఆశిష్ విద్యార్ధి..

  Last Updated: 12 Jul 2023, 07:48 PM IST