Suriya Emotional: ‘‘నా కుమారుడు సూర్య బాగా కష్టపడి ఈ స్థాయికి ఎదిగాడు. ఎంతోమంది అభిమానాన్ని సంపాదించాడు. అతడు కెరీర్ ఆరంభంలో చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక్కోసారి నాన్‌స్టాప్‌గా నాలుగు గంటలపాటు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవాడు. తెల్లవారుజామునే నాలుగు గంటలకు నిద్ర లేచి బీచ్‌కు వెళ్లి స్టంట్స్ నేర్చుకునేవాడు’’ అని హీరో సూర్య తండ్రి శివకుమార్ చెప్పుకొచ్చారు. ‘‘నేను నిజాయితీగా ఇంకో విషయాన్ని చెప్పదలిచాను. నా కుమారుడి కంటే ముందు కోలీవుడ్‌లో ఎవ్వరూ సిక్స్ ప్యాక్‌ను ట్రై చేయలేదు. సినిమాల కోసం అలాంటి బాడీ ట్రై చేసిన తొలి వ్యక్తి నా కొడుకే. అందుకే సూర్యను చూసి గర్విస్తున్నాను’’ అని శివకుమార్ తెలిపారు. తన తండ్రి మాటలు వినగానే హీరో సూర్య ఎమోషనల్ అయ్యారు.
Also Read :Kejriwals Son In Law : కేజ్రీవాల్ అల్లుడు సంభవ్ ఎవరు ? ఏం చేస్తారు ?
అగరం ఫౌండేషన్ కోసమే జీవిస్తున్నాను : హీరో సూర్య
ఆ తర్వాత సూర్య(Suriya Emotional) ఎమోషనల్‌గా ప్రసంగించారు. జీవితం ఎంతో అందమైందని చెప్పారు. జీవితం ఇచ్చే ఏ ఒక్క ఛాన్స్‌నూ వదులుకోవద్దని పిలుపునిచ్చారు. ఎలాంటి రిస్కులైనా తీసుకునే వయసు ఇదేనని యువతకు సూర్య సూచించారు. మానవ జీవితానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏమిటనే దాని గురించి ఆలోచింపజేసే మూవీయే రెట్రో అని ఆయన చెప్పారు. ‘‘నేను నా అగరం ఫౌండేషన్ కోసం జీవిస్తున్నా. ఆ సంస్థ వల్ల దాదాపు 8 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వాళ్లందరి భవిష్యత్తు కోసమే నేను శ్రమిస్తున్నాను’’ అని సూర్య స్పష్టం చేశారు.
Also Read :Central Intelligence: ఐఏఎస్, ఐపీఎస్‌ల ఆస్తులపై ‘‘నిఘా’’.. ఎందుకు ?
సూర్య హీరోగా కార్తిక్ సుబ్బరాజు రూపొందించిన మూవీ ‘రెట్రో’. ఇది రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. దీని ఆడియో విడుదల కార్యక్రమంలో సూర్య, శివకుమార్‌లు పై కామెంట్స్ చేశారు. మే 1న రెట్రో సినిమా విడుదల కానుంది.