Nara Rohit : గ్రాండ్‌గా నారా రోహిత్‌ నిశ్చితార్థం.. హాజరైన ప్రముఖులు వీరే

చంద్రబాబు నాయుడు తమ్ముడి కుమారుడే నారా రోహిత్(Nara Rohit).

Published By: HashtagU Telugu Desk
Nara Rohit Chandrababu Tdp

Nara Rohit : హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో ఇవాళ హీరో నారా రోహిత్ నిశ్చితార్థం గ్రాండ్‌గా జరుగుతోంది. ఉదయం 10:45 గంటలకు శిరీష(సిరి) వేలికి నారా రోహిత్ ఉంగరం తొడిగాడు. వీరిద్దరి వివాహం డిసెంబర్‌ 15న జరగనుంది. ‘ప్రతినిధి 2’ మూవీలో సిరి, రోహిత్ కలిసి నటించారు.  ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైనా.. అందులో నటించిన హీరోయిన్ సిరి లెల్లా మాత్రం రోహిత్‌కు లైఫ్ పార్ట్‌నర్ అయిపోయింది. రోహిత్ వయసు 40 ఏళ్లు. కొన్నాళ్ల క్రితం వారి ఇంట్లో పెళ్లి గురించి టాపిక్ వచ్చింది. దీంతో సిరిని ప్రేమిస్తున్న విషయాన్ని అతడు చెప్పేశాడు. దీంతో పెద్దలు మాట్లాడుకుని నిశ్చితార్థం చేయాలని నిర్ణయించుకున్నారు.వీరి ఎంగేజ్‌మెంట్ వేడుకకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు దంపతులు, నారా లోకేష్ దంపతులు,   నారా, నందమూరి కుటుంబాలు హాజరయ్యాయి.చంద్రబాబు నాయుడు తమ్ముడి కుమారుడే నారా రోహిత్(Nara Rohit).ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో  గన్నవరం ఎంఎల్ఎ యార్లగడ్డ వెంకటరావు, హీరో శ్రీవిష్ణు తదితరులు ఉన్నారు.

Also Read :Baba Siddique : బాబా సిద్దీఖ్‌‌ను హత్య చేసింది మేమే : లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్

  • ‘బాణం’ సినిమాతో నారా రోహిత్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
  • ‘సోలో’ మూవీతో రోహిత్ హిట్ కొట్టాడు.
  • ఆరేళ్ల పాటు గ్యాప్ తీసుకుని ఈ ఏడాది ‘ప్రతినిధి 2’ మూవీలో రోహిత్ నటించాడు.
  • సారొచ్చారు, ఒక్కడినే, ప్రతినిధి, రౌడీ ఫెలో, అసుర, జో అచ్యుతానంద వంటి చిత్రాల్లో రోహిత్ నటించారు.
  • 2018లో విడుదలైన వీర భోగ వసంత రాయలు తర్వాత దాదాపు ఆరేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు.

Also Read :RSS Chief : దళితులు, అట్టడుగు వర్గాలను హిందువులు కలుపుకుపోవాలి : ఆర్ఎస్ఎస్ చీఫ్

  • రోహిత్ హైదరాబాద్‌లోనే చదువుకున్నారు.
  • చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీలో బీటెక్ చేశారు.
  • న్యూయార్క్‌లోని ఫిలిం అకాడమీ నుంచి నటనలో కోర్సు చేశారు.
  • లాస్ ఏంజిల్స్‌లో ఫిల్మ్ మేకింగ్స్ కోర్సు చేశారు.
  • ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోదరుడు దివంగత నారా రామ్మూర్తినాయుడి రెండో కుమారుడు రోహిత్.
  • రోహిత్ కు శిరీష్ అనే అన్న ఉన్నాడు. అతను కూడా ఇంకా వివాహం చేసుకోలేదు.
  Last Updated: 13 Oct 2024, 02:10 PM IST