ఇటీవల కాలంలో టాలీవుడ్ (Tollywood) పరిశ్రమలో నెగిటివ్ రివ్యూ (Negative Review) అనేది పెద్ద సమస్య గా మారింది. సోషల్ మీడియా ద్వారా కొంతమంది వ్యక్తులు ఇచ్చే నెగిటివ్ రివ్యూలు సినిమాల ఓపెనింగ్ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘Arjun Son Of Vyjayanthi’ సక్సెస్ మీట్‌లో విజయశాంతి (Vijayashanthi) స్పష్టంగా నెగిటివ్ రివ్యూలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. “బాగున్న సినిమాలను కూడా బాగోలేదని చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ఎవరికైనా సినిమా నచ్చకపోతే సైలెంట్‌గా ఉండాలి కానీ, తప్పుడు ప్రచారంతో నిర్మాతలు, ఎగ్జిబిటర్లను నష్టపెట్టొద్దు” అంటూ మండిపడ్డారు.
ఇక నేచురల్ స్టార్ నాని (Nani) కూడా నెగిటివ్ రివ్యూలపై స్పందించారు. త్వరలో విడుదల కానున్న తన సినిమా ‘హిట్ 3’ ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ.. “ఒకప్పుడు వేరు..ఇప్పుడు వేరు, ప్రస్తుతం ఎవరి నోటినీ ఆపలేకపోతున్నాం. ఓ సీన్ బాగోలేదని చెప్పడంలో తప్పు లేదు, కానీ మొదటి షోకే సినిమానే డిజాస్టర్ అనడం సరైంది కాదు” అన్నారు. ప్రేక్షకులు సినిమా చూడకుండా ముందుగానే నెగిటివ్ జడ్జ్‌మెంట్ ఇవ్వడం వల్ల దర్శకుడు, నటీనటులు, సాంకేతిక బృందం పడిన కష్టానికి , నిర్మాతలు పెట్టిన పెట్టుబడికి అన్యాయం జరుగుతుందన్నారు.
US family policies: చైనా బాటలో అమెరికా.. పిల్లలను కనేవారికి ప్రత్యేక రాయితీలు.. అవేమిటంటే?
సినీ పరిశ్రమలో బాగున్న సినిమాలకూ అన్యాయం జరుగుతుందన్న భావన పెరిగిపోతుండటంతో పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు, ఉద్దేశపూర్వకమైన రివ్యూలతో సినిమా ఫలితాన్ని ప్రభావితం చేయడం ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సినిమాపై వ్యతిరేక అభిప్రాయం ఉన్నా అది వ్యక్తిగతంగా ఉంచుకోవాలని, ఒకటి రెండు రోజులు గడిచిన తర్వాతే రివ్యూలు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.