Nani on Rana Naidu: రానా నాయుడుపై నాని రియాక్షన్.. రానా కొత్తగా ట్రై చేశాడంటూ!

(Nani) మాట్లాడుతూ.. రానా ఎప్పుడు కూడా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.

Published By: HashtagU Telugu Desk
Nani

Nani

వెబ్ సీరిస్ (Web Series) అంటే చాలామందికి బోర్ అనే ఫీలింగ్ ఉండేది. ఎప్పుడైతే మిర్జాపూర్ సీరిస్ విడుదల అయ్యిందో, వెబ్ సీరిస్ క్రేజ్ ఎంటో తెలిసింది సీని లవర్స్ కు. మిర్జాపూర్ తర్వాత అలాంటి వెబ్ సీరిస్ చూడాలని చాలామంది అనుకున్నారు. కానీ ఆస్థాయి సీరిస్ లు రాలేదని చెప్పాలి. ఆ తర్వాత చాలరోజులకు రానా నాయుడు అనే వెబ్ సీరిస్ మళ్లీ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తోంది. ఇందులో బోల్డ్ సీన్స్, బూతు డైలాగ్స్ ఉన్నప్పటికీ నెట్ ఫిక్స్ లో ఏ రేంజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ నేపథ్యంలో హీరో నాని (Nani) రానా నాయుడు (Rana Naidu)పై రియాక్ట్ అయ్యారు.

ఈ సిరీస్ గురించి నాని (Nani) మాట్లాడుతూ.. రానా ఎప్పుడు కూడా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇతరులు చేసే దాన్ని మనం ఎందుకు చేయకూడదు అంటూ ప్రయత్నించే క్రమంలో రానా ఈ సిరీస్ ను చేశాడని తాను భావిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. ‘రా’ అంశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ రానా కు ఇది ఒక మంచి ప్రయోగం అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

రానా ముందు ముందు ఇలాంటి ప్రయోగాలు చేయాలని తాను ఆశిస్తున్నాను. రానా ఇలాంటి ప్రయోగాలను చేయడం ద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడని నాని (Nani) పేర్కొన్నాడు. వెబ్ సిరీస్ ల్లో నటించాలనే ఆలోచన వచ్చిన నేపథ్యంలో మొదట ఇలాంటి విమర్శలు తప్పవని.. కానీ భవిష్యత్తులో అంతా కూడా వెబ్ సిరీస్ ట్రెండ్ ను ఫాలో అయ్యే అవకాశాలున్నాయని నాని పేర్కొన్నాడు. అయితే రానా, వెంకీ ఇలాంటి పాత్రలు చేయడాన్ని తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం సహించలేకపోతున్నారు. బోల్డ్ కంటెంట్ ద్రుష్టిలో పెట్టుకొని రానా ‘ఫ్యామిలీతో ఈ సినిమా చూడొద్దని’ ముందే హెచ్చరించిన విషయం తెలిసిందే.

Also Read: Kantara In United Nations: ఖండాంతరాలు దాటిన ‘కాంతార’ క్రేజ్.. ఐక్యరాజ్యసమితిలో స్పెషల్ షో!

  Last Updated: 16 Mar 2023, 04:29 PM IST