Site icon HashtagU Telugu

Hero Karthi : అమ్మలేని ఇంట్లో ఉండటం నా వల్ల కావటం లేదంటూ..జ్యోతిక ఫై కార్తీ ఎమోషనల్ పోస్ట్

Hero Karthi Post

Hero Karthi Post

హీరో కార్తీ (Hero Karthi) పోస్ట్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు అందర్నీ కట్టిపడేస్తుంది. సూర్య (Surya) , కార్తీ వీరిద్దరూ మంచి అన్నదమ్ములే కాదు..మంచి ఫ్రెండ్స్ కూడా..చిత్రసీమలో అడుగుపెట్టి అటు తమిళ్ పాటు ఇటు తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం మొన్నటి వరకు ఈ ఇద్దరు కలిసి ఒకే కుటుంబంలో ఉన్నారు. కానీ రీసెంట్ గా సూర్య ముంబై కి షిఫ్ట్ అయ్యాడు. అక్కడే ఫ్యామిలీ తో ఉంటూ షూటింగ్ సమయంలో సొంత రాష్ట్రానికి వచ్చి వెళ్తున్నారు.

ఈ క్రమంలో కార్తీ ఎమోషనల్ పోస్ట్ చేసి అందర్నీ ఆకట్టుకున్నాడు. ‘అమ్మలేని (జ్యోతిక) ఇల్లు బోసి పోతున్నది.. నేను ఆమె (Jyothika)ను వదినగా ఎప్పుడూ చూడలేదు అమ్మగానే చూశాను. తను కూడా తన పిల్లల్లో నన్నూ ఒకడిగా చూసుకుంది. ఇప్పుడు అమ్మ ఇల్లు వదిలి ముంబయ్‌లో ఉండటం బాధగా ఉంది. అమ్మలేని ఇంట్లో ఉండటం నా వల్ల కావటం లేదు. ఇన్నాళ్లూ ఈ ఇల్లు ఉమ్మడికుటుంబంలా కలిసిమెలిసి ఉందంటే కారణం అమ్మే. అందరం కలిసి ఉన్న ఆ రోజులు గుర్తొస్తే గుండె బరువెక్కుతోంది. అన్నయ్య పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. పిల్లల చదువులకోసం మాత్రమే వాళ్లు ముంబయి వెళ్లారు. ప్రస్తుతానికైతే పండగలకు కలుస్తుంటాం. మళ్లీ అందరం కలిసుండే రోజు కోసం ఎదురుచూస్తున్నా.” అంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ చేసాడు. ఈ పోస్ట్ చూసి అభిమానులే కాదు చిత్రసీమ ప్రముఖులు సైతం కుటుంబంలోని ఆప్యాయతలకు అద్దంపట్టేలా వీరు ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు.

Read Also : TDP : ఈ రోజు సాయంత్రం చంద్ర‌బాబుతో ములాఖ‌త్ కానున్న కుటుంబ‌స‌భ్యులు

Exit mobile version