Bangalore Rave Party : నటి హేమ అరెస్ట్

ఇక బెంగళూరులో గత నెల 20న జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు. ఈ రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్ కూడా దొరకడంతో.. ఆ పార్టీలో పాల్గొన్న వారి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు

Published By: HashtagU Telugu Desk
Hema

Film actress Hema's commentary on the Bangalore Rave Party

బెంగుళూర్ రేవ్ పార్టీ (Bengaluru Rave Party) లో అడ్డంగా దొరికిన నటి హేమ(Hema) కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్ట్. ఈ కేసులో సోమవారం హేమను అరెస్ట్ చేసిన బెంగుళూరు సీసీబీ పోలీసులు వైద్య పరీక్షల అనంతరం రాత్రి ఆమెను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. దీంతో హేమకు మేజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు ఆమెను జైలుకు తరలించారు. ఇక బెంగళూరులో గత నెల 20న జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు. ఈ రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్ కూడా దొరకడంతో.. ఆ పార్టీలో పాల్గొన్న వారి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. వారిలో 86 మంది బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు.

We’re now on WhatsApp. Click to Join.

వీరిలో నటి హేమకూడా ఒకరు. దీంతో ఈనెల 27వ తేదీన విచారణకు రావాలని హేమకు బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే హేమ విచారణకు హాజరు కాలేదు. ఆ తర్వాత కూడా నోటీసులు జారీ చేసిన ఆమె హాజరుకాకపోవడంతో నేరుగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీ నిర్వహణలో ఆమె కీలక పాత్ర వహించినట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. హేమ మీడియా కంటపడకుండా ఉండేందుకు బుర్ఖాలో వచ్చారు. ఆమెకు ఆ బుర్ఖాలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. హేమతో పాటు మరొకరిని సీసీబీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.

Read Also : CM Nitish Kumar: ఢిల్లీలో నితీష్ ఆపరేషన్ సక్సెస్.. కేంద్రమంత్రి పదవి ఖరారు

  Last Updated: 04 Jun 2024, 08:20 AM IST