Prabhas Pic: ఆయన ప్రభాస్ కాదు.. ఫేక్ పిక్, చక్కర్లు కొడుతున్న డార్లింగ్ ఫొటో!

ప్రభాస్ లుక్ ఆకర్షణగా లేకపోవడంతో గతంలో ఆయనపై విమర్శలతో పాటు ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది.

Published By: HashtagU Telugu Desk
Prabhas

Prabhas

బాహుబాలి (Bahubali) సినిమాతో పాన్ ఇండియా స్టార్ అవతరించాడు ప్రభాస్ (Prabhas). ఈ డార్లింగ్ యాక్టర్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ సందడి కూడా ఎక్కువే. ఇప్పటికే పలు భారీ ప్రాజెక్టు సినిమాలతో బిజీగా ఉన్న ఈ నటుడుపై ఆది పురుష్ సినిమాతో ట్రోలింగ్ (Trolling) మొదలైంది. ప్రభాస్ లుక్ ఆకర్షణగా లేకపోవడంతో గతంలో ఆయనపై విమర్శలతో పాటు ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే ప్రభాస్ లుక్స్ పై కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి.

ఇటీవల ప్రభాస్ (Prabhas) కు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లెజెండ్ రజనీకాంత్, శివ రాజ్‌కుమార్‌తో పోజులిస్తుండటం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ ఫొటో కచ్చితంగా మార్ఫింగ్ చేసినట్టు కనిపిస్తోంది. “అతను ప్రభాస్ కాదు!!, ఇది ఫేక్ పిక్ కాదా? అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ ఎక్కువగా మద్యం తాగాడా? అని కూడా కామెంట్స్ చేస్తున్నారు.

బాహుబలితో పాటు సాహో, రాధే శ్యామ్ వంటి సినిమాల్లో కూడా ప్రభాస్ (Prabhas) కనిపించాడు. సాహో కమర్షియల్‌గా ఫ్లాప్ అయినప్పటికీ హిందీ వెర్షన్ విజయవంతమైంది. మరోవైపు, రాధే శ్యామ్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినప్పటికీ పూజా హెగ్డేతో అతని కెమిస్ట్రీ ప్రేక్షకులకు నచ్చింది. ప్రభాస్ చేతిలో ఆదిపురుష్, సాలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ వంటి భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఆదిపురుష్ ఈ ఏడాది జూన్ 16న హిందీ, తెలుగు రెండు భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్‌లతో పాటు సన్నీ సింగ్ కూడా కనిపించనున్నారు.

Also Read: Ram Charan: ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టిన రామ్ చరణ్.. ఘనస్వాగతం పలికిన ఫ్యాన్స్

  Last Updated: 17 Mar 2023, 03:52 PM IST