జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ గురించి ప్రతిఒక్కరికి తెలిసిందే. ఆయన రాజకీయాల్లోకి వచ్చాక ట్విట్టర్ లో ఫుల్ యాక్టివ్ గా మారిపోయారు. ఈ నేపథ్యంలో అటు అభిమానులు, అటు జనసైనికుల కోసం నిత్యం అందుబాటులోకి ఉండేందుకు ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇన్ స్టాగ్రాంలోకి పవన్ ఎంట్రీ ఇవ్వనున్నారని ఆయన సోదరుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు పేర్కొన్నారు. ఈమేరకు ఆయన తన ఇన్ స్టా అకౌంట్ లో ఓ పోస్టు పెట్టారు.
అయితే, పవర్ స్టార్ ఎంట్రీ ఎప్పుడనేదానిపై మాత్రం నాగబాబు క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ ఖాతాను పవన్ జనసేన పార్టీ కార్యక్రమాల కోసం, రాజకీయ అవసరాల కోసమే వాడనున్నారని సమాచారం. దక్షిణాది సూపర్ స్టార్, తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి అకౌంట్ ప్రారంభించిన 99 నిముషాల్లోనే 1 మిలియన్ వ్యూస్ ను సాధించి రికార్డును సృష్టించింది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పవర్ స్టార్ అభిమానులు ఈ రికార్డును బ్రేక్ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఓవైపు వరుసగా సినిమాలు, మరోవైపు రాజకీయాలతో పవన్ కల్యాణ్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు స్వల్ప విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనూ విశ్రాంతి తీసుకోకుండా ‘బ్రో’ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పూర్తిచేసినట్లు సమాచారం.ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తున్న బ్రో, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలు నిర్మాణంలో వివిధ దశల్లో ఉన్నాయి.
Also Read: Haryana CM: పెళ్లి కాని వారికి పెన్షన్.. హర్యానా సీఎం నిర్ణయం