Site icon HashtagU Telugu

Pawan Kalyan : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇకలేనట్లేనా..? హరీష్ శంకర్ ఏమన్నాడంటే..!!

Pawan Kalyan Ustaad Bhagat Singh Movie Acion Shoot Started

Pawan Kalyan Ustaad Bhagat Singh Movie Acion Shoot Started

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం ఎంత బిజీ గా ఉన్నాడో..తెలియంది కాదు. గత కొద్దీ నెలలుగా సినిమా షూటింగ్ లను వదిలేసి రాజకీయాలతో బిజీ గా ఉన్నారు. ఎన్నికల ప్రచారం..ఆ తర్వాత విజయం..ఉప ముఖ్యమంత్రి తో పాటు , పలు శాఖలకు మంత్రి గా బాధ్యతలు చేపట్టి వరుస సమీక్షలు , ప్రజల సమస్యలు తెలుసుకోవడం , పర్యటన తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు.

ఈ తరుణంలో ఆయన మళ్లీ సినిమాలు చేస్తాడా అనేది అభిమానుల్లో టెన్షన్ గా మారింది. ఈ క్రమంలో మొన్న పిఠాపురం సభలో మూడు నెలల తర్వాత OG షూటింగ్ లో పాల్గొంటున్నాని , సినిమా చాల బాగుంటుందని..ఒక్క మూడు నెలలు నన్ను వదిలిపెట్టండి..రాష్ట్రానికి చేయాల్సిన పనులు చాల ఉన్నాయి..తప్పకుండా వచ్చి షూటింగ్ లో జాయిన్ అవుతానని నిర్మాతలకు చెప్పినట్లు స్వయంగా పవన్ తెలిపాడు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమా షూటింగ్ గురించి స్పందించకపోవడం తో ఇక ఈ సినిమా ఆగిపోయానట్లే నని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం అవుతుండడం తో ఈ వార్తలపై డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) క్లారిటీ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

‘సినిమా స్టార్ట్ అవ్వదు అన్నప్పుడే రూమర్స్ పట్టించుకోలేదు. ఇప్పుడు రూమర్స్ చదివే టైమ్ కూడా లేదు’ అని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసాడు. ఇలా అనడానికి కారణం కూడా ఉంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఓపెనింగ్ దగ్గరి నుండి ఈ మూవీ ఫై అనేక రకాలుగా రూమర్లు ప్రచారం చేస్తూ వస్తున్నారు..అయినప్పటికీ సినిమా మాత్రం శరవేగంగా షూటింగ్ జరగడం టీజర్ , మేకింగ్ వంటివి రిలీజ్ అవ్వడం జరిగింది. దీంతో ఈ సినిమా ఫై రూమర్లు రావడం కామన్ గా మారడం తో హరీష్ ఇప్పుడు ఆలా స్పందించారు. ప్రస్తుతం హరీష్ శంకర్ ..రవితేజ తో మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్నాడు.

Read Also : Bihar Bridge Collapse : బిహార్లో 14 రోజుల్లో 12 బ్రిడ్జిలు కూలిపోయాయి..ప్రభుత్వం ఏంచేస్తుందంటే..!!