Pawan Kalyan : పవన్‌ని కలిసిన హరిహర వీరమల్లు మూవీ టీమ్.. షూటికి రెడీ అవుతున్న డిప్యూటీ సీఎం..

పవన్ సినిమా షూటింగ్స్ ఎప్పుడు మొదలుపెడతాడా అని ఎదురుచూస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
HariHara VeeraMallu Movie Teems Meets Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా బిజీ ఉన్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లో బిజీ అవ్వడంతో పవన్ చేతిలో ఉన్న మూడు సినిమాలు ఆగిపోయాయి. కానీ వీలు కుదిరినప్పుడు ఆ సినిమాలు పూర్తిచేస్తానని అభిమానులకు హామీ ఇచ్చాడు పవన్. దీంతో పవన్ సినిమా షూటింగ్స్ ఎప్పుడు మొదలుపెడతాడా అని ఎదురుచూస్తున్నారు.

ఇటీవల పవన్ డేట్స్ ఇస్తానని చెప్పడంతో హరిహరవీరమల్లు(Hari Hara Veera Mallu) షూటింగ్ మొదలుపెట్టారు. కానీ ఏపీలో వరదలు రావడంతో సహాయక చర్యల్లో పవన్ బిజీ అయ్యారు. తాజాగా హరిహర వీరమల్లు మూవీ టీమ్ పవన్ కళ్యాణ్ ని కలిశారు. డైరెక్టర్ జ్యోతికృష్ణ, నిర్మాత AM రత్నంతో పాటు మరికొందరు కలిశారు. నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ గురించి మాట్లాడి పవన్ ఓకే అనడంతో త్వరలోనే షూట్ ప్లాన్ చేస్తున్నారట.

త్వరలోనే హరిహార వీరమల్లు షూటింగ్ ని మొదలుపెట్టబోతున్నారట. సెప్టెంబర్ చివరి వారంలో షూట్ మొదలుపెట్టి దాదాపు 20 రోజుల పాటు షూట్ చేయనున్నారని తెలుస్తుంది. 20 రోజుల్లో పవన్ కి సంబంధించిన భాగం అంతా షూట్ పూర్తిచేసేయాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తుంది. ఈ సినిమా అయ్యాకే OG సినిమాకు డేట్స్ ఇవ్వనున్నారు పవన్. మరి ఇటు షూటింగ్, అటు ప్రభుత్వ కార్యక్రమాలు పవన్ ఎలా మేనేజ్ చేస్తాడో చూడాలి.

 

Also Read : Jani Master Wife : జానీని వదిలేస్తా అంటూ భార్య సంచలన వ్యాఖ్యలు

  Last Updated: 20 Sep 2024, 06:31 AM IST