Site icon HashtagU Telugu

Pawan Kalyan : వీరమల్లు మూవీ.. పవన్ కి లాస్ అన్నట్టే..!

Hari Hara Veera Mallu

Harihara Veeramallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్ లో మొదలు పెట్టిన హరి హర వీరమల్లు (Hari Hara Veeramallu) సినిమా ఇప్పటికీ పూర్తి కాలేదు. ఏ.ఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా మొదలై దాదాపు నాలుగేళ్లు అవుతుంది. ఈ సినిమా పూర్తి చేయడానికి టైం పడుతుందని క్రిష్ ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్లి వేరే సినిమా మొదలు పెట్టాడు. వీరమల్లు సినిమా మిగిలిన షూటింగ్ అంతా ఏ.ఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు.

హరి హర వీరమల్లు సినిమాను ముందు ఒక పార్ట్ గానే అనుకున్నా ఈమధ్యనే సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. ఐతే సినిమాను నిర్మాతలు వారి సొంత లాభాల కోసం 2 భాగాలుగా చేస్తున్నారని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కి ఇది ఒక ప్రాజెక్ట్ కిందే లెక్క గట్టి ఆయనకు రెమ్యునరేషన్ ఇస్తున్నారట.

అంటే వీరమల్లు రెండు భాగాలకు కలిసి పవన్ పోర్షన్స్ అంతా పూర్తి చేస్తున్నారట. అలా ఐతే ఈ సినిమా ద్వారా పవర్ స్టార్ కి లాస్ అన్నట్టే లెక్క. ఏపీకి డిప్యూటీ సీఎం (Deputy CM) గా ఉన్న పవన్ అసలు సినిమాలు చేయడమే చాలా గ్రేట్ అనే పరిస్థితి ఏర్పడింది. ఆయన పూర్తిస్థాయిలో రాజకీయాల్లో బిజీ అవ్వాలని చూస్తున్నాడు. అందుకే పవన్ (Pawan Kalyan) సినిమాలను పూర్తి చేయలేకపోతున్నాడు.

అందుకే వీరమల్లు పవన్ కి సంబందించిన సీన్స్ అన్ని పూర్తి చేసి సినిమాను రెండు ముక్కలుగా చేసి ఒక భాగం ఈ ఇయర్ ఎండింగ్ లో మరో పార్ట్ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లేదా సెకండ్ హాఫ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఈ విషయం తెలిసి షాక్ అవుతున్నారు. వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ (Nidhi Agarwal) హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

Also Read : Karna : టాలీవుడ్ నుంచి మరో కర్ణ రాబోతుందా..?