పవన్ కళ్యాణ్ మరియు నిధి అగర్వాల్ (Pawan Kalyan – Nidhi Agarwal) జంటగా రూపొందిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ (Harihara Veera Mallu) ఎన్నో ఎదురుదెబ్బలు తట్టుకుంటూ చివరకు మళ్లీ వాయిదా పడింది. క్రిష్ జాగర్లమూడి మరియు జ్యోతికృష్ణల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మొదట రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. తొలి భాగమైన ‘స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’ జూన్ 12న విడుదలవుతుందన్న ప్రకటనతో అభిమానుల్లో ఆశలు పెరిగినా, చివరికి మళ్లీ నిరాశే మిగిలింది. ippatik సినిమా వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాకపోవడం, నిర్మాత ఏఎం రత్నం ఆర్థిక సమస్యల్లో చిక్కుకోవడం వంటివి ఆలస్యం ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.
Terror Attack : పహల్గామ్‌లో పర్యాటకులపై దాడి కి కారణం అదే అంటూ మోడీ కీలక వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలో ఎట్టకేలకు చిత్ర నిర్మాతలు అధికారిక ప్రకటన చేస్తూ జూన్ 12న విడుదల చేయలేకపోతున్నామని (Harihara Veera Mallu Postponed) స్పష్టం చేశారు. సినిమాను అత్యుత్తమంగా అందించాలనే లక్ష్యంతో కొంత మరింత సమయం తీసుకుంటున్నట్టు తెలిపారు. “పవన్ కళ్యాణ్ నటనకు తగిన నాణ్యతతో సినిమా రూపొందించడమే మా లక్ష్యం. ప్రతి ఫ్రేమ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నాం. దానికి ఇంకొంత సమయం అవసరం. కానీ, మీ ప్రేమకు ప్రతిఫలంగా గొప్ప చిత్రాన్ని అందిస్తాం” అని చెప్పడం ద్వారా అభిమానులను ఓదార్చే ప్రయత్నం చేశారు.
Terror Attack : పహల్గామ్‌లో పర్యాటకులపై దాడి కి కారణం అదే అంటూ మోడీ కీలక వ్యాఖ్యలు
అయితే ఈ ప్రకటనతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి పెరిగింది. మూడేళ్లుగా ఈ సినిమాను ఎదురు చూస్తున్నామని, మళ్లీ వాయిదాతో ఆశలన్నీ నాశనమవుతున్నాయని అంటున్నారు. పైగా కొత్త విడుదల తేదీని కూడా ప్రకటించకపోవడంతో అనేక సందేహాలు రేకెత్తుతున్నాయి. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం జులై 4న విడుదల చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. అయితే అదే రోజు విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ సినిమా విడుదల కావడంతో మరోసారి రిలీజ్ క్లాష్ తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ‘వీరమల్లు’ భవితవ్యం ఏమైపోతుందో? అన్నది అభిమానుల్లో మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిపోయింది.