Hari Hara Veera Mallu New Release Date : పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్. హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) మేకర్స్ మరోసారి సినిమాను వాయిదా వేశారు. క్రిష్ (Krish) – జ్యోతికృష్ణ (JyothKrishna) – పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కలయికలో ‘హరి హర వీర మల్లు’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభమై దాదాపు మూడేళ్లు పూర్తి అవుతున్న ఇంతవరకు పూర్తి కాలేదు. ఈ సినిమా తర్వాత మొదలుపెట్టిన సినిమాలు పూర్తి అవ్వడం..రిలీజ్ అవ్వడం జరిగింది కానీ ‘హరి హర వీర మల్లు’ మాత్రం అక్కడే ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ గా ఉండడం..పీరియాడికల్ మూవీ కావడం తో ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడుతూ వస్తుంది. అసలు ఈ సినిమా రాదనే అనుకుంటున్నా తరుణంలో ఆ మధ్య మేకర్స్ సినిమాను మార్చి 28 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి సంతోషం నింపారు. కానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోయేసరికి మరోసారి వాయిదా పడడం ఖాయమని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడే అదే విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
Holi : ఇంట్లోనే సహజ సిద్ధమైన రంగులు సిద్ధం చేసుకోవచ్చు..ఎలా అంటే !
హోలీ పండుగ సందర్భంగా సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో పవర్ స్టార్తో పాటు ఇతర నటులు గుర్రాలపై ఉన్నారు. మార్చి 28న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను మే 9న రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. క్రిష్, జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. తొలి పార్టు ‘sword vs spirit’ ట్యాగ్ను ఖరారు చేశారు. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే కథతో పవన్ అభిమానులను అలరించనున్నారు. మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతోంది. పవన్ కల్యాణ్ ఓ వీరోచిత బందిపోటుగా కనిపిస్తారట. అలాగే ఈ మూవీ లో బాబీ దేవోల్, అనుపమ్‌ఖేర్, నోరా ఫతేహి, విక్రమ్ జీత్, నిధి అగర్వాల్, జిషుసేన్ గుప్త ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి స్వరాలు అందిస్తున్న ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
The battle is set, and the fight for JUSTICE and DHARMA will be unstoppable! ⚔️🔥#HariHaraVeeraMallu charges into battle at breakneck speed, and NOTHING will alter the hunt this time.
A saga of valor is all set to ignite the screens on May 9th, 2025 ❤️🔥💥
A POWER-PACKED… pic.twitter.com/BOE4mmmbXY
— Hari Hara Veera Mallu (@HHVMFilm) March 14, 2025