పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూసిన ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా చివరికి తెరపైకి వచ్చేసింది. అయితే ఈ సినిమాపై భారీ అంచనాలున్నప్పటికీ, ఫలితం ఆశించినంత బలంగా రాలేదు. సినిమా మొదటి భాగం కొంతవరకు ఆకట్టుకున్నా, ద్వితీయార్ధం ప్రేక్షకులను నిరాశపరిచింది. ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో తేడా పెద్దగానే కనిపించింది. తుపాను నేపథ్యంలోని యానిమేషన్ ఫీలింగ్ కలిగించే విజువల్స్, అసలు కథానుగుణంగా లేవని పలువురు విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సినిమా చివర్లో ‘వీరమల్లు-2: యుద్ధభూమి’ అనే టైటిల్‌తో సీక్వెల్‌కి బాట వేసిన దర్శకుడు జ్యోతికృష్ణ నిర్ణయంపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. సాధారణంగా సీక్వెల్‌లు విజయవంతమైన మొదటి భాగానికి మాత్రమే తీస్తారు. కానీ మొదటి భాగం మిశ్రమ స్పందన పొందిన ఈ సందర్భంలో రెండో భాగాన్ని తెరకెక్కించడం ఓ రిస్క్‌గా మారింది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రమోషన్లు ఎంతగా హైప్ క్రియేట్ చేసినా, తుది ఫలితమే సీక్వెల్ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.
MLA Padi Kaushik Reddy : ఎమ్మెల్యే పాడి కౌశిక్ ఇంటివద్ద టెన్షన్..టెన్షన్
ఇంకా కొంత భాగం చిత్రీకరణ పూర్తయ్యిందని పవన్ స్వయంగా తెలిపినప్పటికీ, ఇది పూర్తి కావడం అనేది అనేక అంశాలపై ఆధారపడుతుంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే రాజకీయాల్లో పూర్తిగా బిజీగా ఉన్నారు. ఆయన తాజా సంకేతాలను బట్టి సినిమాలకే గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటప్పుడు ఆయన నుంచి ‘వీరమల్లు-2’ కోసం డేట్లు దొరకడం ఎంతవరకు సాధ్యమవుతుందో అనుమానమే. నిర్మాత ఏఎఎం రత్నం కూడా రెండో పార్ట్ పై ప్రమోషన్ లలో ప్రశ్నించగా..ఇది హిట్ అయ్యాకనే అన్నట్లు చెప్పకనే చెప్పాడు.
ఇక ఇప్పుడు మొదటి భాగం అనుకున్న స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోవడం, సినిమా కు డిజాస్టర్ టాక్ రావడం తో రెండో పార్ట్ తీస్తాడనేది సందేహాస్పదంగా మారింది. ఓవరాల్ గా చూస్తే వీరమల్లు 2 అనేది సెట్స్ పైకి వచ్చే ప్రసక్తి లేదని పక్కాగా తెలుస్తుంది. జ్యోతికృష్ణ డైరెక్షన్ ఏమాత్రం బాగాలేదని తేలిపోవడంతో రెండో పార్ట్ పై అంత ఆశలు వదులుకోవాల్సిందే అని ఫిక్స్ అవుతున్నారు.