Hari Hara Veera Mallu: వీరమల్లు సెన్సార్ టాక్

Hari Hara Veera Mallu: తాజాగా సినిమా సెన్సార్(Hari Hara Veera Mallu Censor) కార్యక్రమం పూర్తవడంతో విడుదలకు మార్గం సుగమమైంది. సెన్సార్ బోర్డు నుంచి 'యు/ఎ' సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం మొత్తం నిడివి 2 గంటల 42 నిమిషాలు

Published By: HashtagU Telugu Desk
Hhvm Censor

Hhvm Censor

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu): పార్ట్ 1 – స్వార్డ్ vs స్పిరిట్’ జూలై 24, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా సినిమా సెన్సార్(Hari Hara Veera Mallu Censor) కార్యక్రమం పూర్తవడంతో విడుదలకు మార్గం సుగమమైంది. సెన్సార్ బోర్డు నుంచి ‘యు/ఎ’ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం మొత్తం నిడివి 2 గంటల 42 నిమిషాలు. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు పవన్ కళ్యాణ్ యాక్టింగ్ , విజువల్స్, కథనానికి ఫిదా అవుతూ చిత్ర బృందాన్ని అభినందించినట్లు సమాచారం.

17 వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్య నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ధర్మ యోధుడిగా కనిపించనున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు విప్లవాత్మకంగా పోరాడిన వీరుడి పాత్రలో పవన్ కనిపించనుండటంతో, సినిమా ఒక పవర్ ఫుల్ మెసేజ్‌తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్‌గా నిలవనుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే దాదాపుగా ముగియడంతో విడుదలకు ముందు రికార్డుల హడావిడి మొదలైంది.

Banakacharla : ఏపీకి షాక్ ఇచ్చిన తెలంగాణ.. బనకచర్లపై చర్చకు నో

ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటించారు. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ప్రతినాయకుడిగా కనిపించనుండగా, నర్గీస్ ఫఖ్రీ, నోరా ఫతేహి, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, సుబ్బరాజు వంటి తారాగణం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించడం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తెలుగు సహా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుండటం విశేషం.

ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. కథకు క్రిష్ జాగర్లమూడి, దర్శకత్వానికి జ్యోతి కృష్ణ బాధ్యతలు నిర్వర్తించారు. విశాఖపట్నంలో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరవుతారన్న టాక్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కచ్చితంగా సినిమా చేస్తా అంటున్న డిజాస్టర్ డైరెక్టర్

  Last Updated: 15 Jul 2025, 12:18 PM IST