Chiru Loves Charan: “ప్రౌడ్ ఆఫ్ యు నాన్నా.. హ్యాపీ బర్త్ డే!

కొడుకు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి.

Published By: HashtagU Telugu Desk
Whatsapp Image 2023 03 27 At 12.47.37 Pm

Whatsapp Image 2023 03 27 At 12.47.37 Pm

సినీ నటుడు రామ్ చరణ్ (Ram Charan) బర్త్ డే ఇవాళ. ఈ మెగా పవర్ స్టార్ బర్త్ డే ను పురస్కరించుకొని మెగా అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. రక్తదానాలు, అన్నదానాలు చేస్తూ తమ ప్రేమను చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొడుకు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. సోషల్ మీడియాలో కొడుకు నుదుటిపై ముద్దు పెట్టిన చిరు “ప్రౌడ్ ఆఫ్ యు నాన్నా.. హ్యాపీ బర్త్ డే!!” పోస్ట్ పెట్టారు. దీంతో కొద్ది నిమిషాల్లో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అభిమానులు రామ్ చరణ్‌కు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

చిరుత, మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తన సత్తా ఏంటో చాటిన రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. ఇక తన నటనా జీవితంతో పాటు అనేక దాతృత్వ కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నాడు. అతను సామాజిక కారణాలలో చురుకుగా పాల్గొంటున్నాడు మరియు COVID-19 మహమ్మారి సమయంలో చాలా మందికి సహాయం చేశాడు. అతని స్వచ్ఛంద సంస్థ, కొణిదెల ఛారిటబుల్ ఫౌండేషన్, వెనుకబడిన వారికి సహాయం అందించడంలో విశేషమైన పని చేస్తోంది.

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ పరిశ్రమకు చెందిన అభిమానులు సోషల్ మీడియాలో రామ్ చరణ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. #HappyBirthdayRamCharan అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఇక రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా వెంకటేశ్వర క్రియేషన్స్ ఆర్‌సి 15కి “గేమ్ ఛేంజర్” అనే టైటిల్‌ను విడుదల చేసింది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ పాన్-ఇండియాగా రూపుదిద్దుకోబోతోంది. ఇక ఈ మూవీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్రేస్ ను మరింత పెంచేలా ఉండబోతోందని టాక్.

Also Read: Malla Reddy With Pawan: టాలీవుడ్ మెచ్చిన ‘విలన్’ మల్లారెడ్డి

  Last Updated: 27 Mar 2023, 01:27 PM IST