Hanuman : ఓటీటీలో దుమ్ముదులుపుతున్న ‘హనుమాన్’

కేవలం 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాతలకు లాభాల పంట పండించింది. దాదాపు రూ.250 కోట్ల గ్రాస్‌ను సాధించి అబ్బురపరచింది

Published By: HashtagU Telugu Desk
Hanuman Ott

Hanuman Ott

థియేటర్స్ లోనే కాదు ఓటిటి ఫ్లాట్ ఫామ్ ఫై కూడా హనుమాన్ మూవీ దుమ్ముదులుపుతుంది. కథలో దమ్ముండాలే కానీ అది చిన్న చిత్రమా..పెద్ద చిత్రమా..అగ్ర హీరో నటించాడా..చిన్న హీరో నటించాడా అనేది ప్రేక్షకులు చూడరని మరోసారి హనుమాన్ (Hanuman ) మూవీ నిరూపించింది. ట్రైలర్ తోనే ఆసక్తి రేపిన హనుమాన్..విడుదల తర్వాత అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించింది.

We’re now on WhatsApp. Click to Join.

తేజ సజ్జా (Teja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prashanth Varma) తెరకెక్కించిన రియల్ సూపర్ హీరో మూవీనే ‘హనుమాన్’. ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్‌లు సంగీతాన్ని సమకూర్చారు. కేవలం 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాతలకు లాభాల పంట పండించింది. దాదాపు రూ.250 కోట్ల గ్రాస్‌ను సాధించి అబ్బురపరచింది. ఇక థియేటర్‌లో దుమ్ము దులిపేసిన ఈ చిత్రం ఓటీటీలో కూడా దుమ్ము దులుపుతుంది. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో ప్రస్తుతం ప్రసారం అవుతోంది. జీ5 ఓటీటీలో గంటల్లోనే మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌ని నమోదు చేసి రికార్డ్ సృష్టించింది. కేవలం 5 రోజుల్లో 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను నమోదు చేసినట్టుగా ఓటీటీ సంస్థ జీ5 సోషల్ మీడియా ద్వారా తెలిపింది. దీనిబట్టి చూస్తే హనుమాన్ మూవీకి ఎంతటి క్రేజ్ ఉందో అర్థం అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ కి కొనసాగింపుగా జై హనుమాన్ మూవీ పనుల్లో డైరెక్టర్ ప్రశాంత్ ఉన్నారు.

Read Also : Thandai Benefits: హోలీ స్పెష‌ల్ డ్రింక్ తాండై.. ఇంట్లోనే త‌యారు చేసుకోండిలా..?

  Last Updated: 23 Mar 2024, 01:55 PM IST