Hanuman OTT : హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..!

Hanuman OTT ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజా సజ్జా లీడ్ రోల్ లో వచ్చిన సినిమా హనుమాన్. పాతిక కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైంది. సినిమా రిలీజ్ ముందు టీజర్, ట్రైలర్

Published By: HashtagU Telugu Desk
Hanuman OTT

Hanuman

Hanuman OTT ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజా సజ్జా లీడ్ రోల్ లో వచ్చిన సినిమా హనుమాన్. పాతిక కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైంది. సినిమా రిలీజ్ ముందు టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచగా సినిమా ఆడియన్స్ ని అలరించి పాన్ ఇండియా హిట్ అందుకుంది. హనుమాన్ సినిమా ఫుల్ రన్ లో దాదాపు 300 కోట్ల పైన వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా సంక్రాంతి సినిమాల రికార్డులనే కాదు 100 ఏళ్ల తెలుగు సినీ రికార్డులను తిరగరాసింది.

లేటెస్ట్ గా 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా నెవర్ బిఫోర్ అన్న రేంజ్ లో రికార్డులను సృష్టించింది. ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్ తో సినిమా సీక్వెల్ జై హనుమాన్ ని మరింత భారీగా తెరకెక్కనున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇదిలాఉంటే హనుమాన్ సినిమా థియేటర్ లో మిస్సైన వారు ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.

జీ 5 హనుమాన్ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను మొదట మార్చి 2న రిలీజ్ చేయాలని అనుకున్నా ఆ డేట్ మార్చి లేటెస్ట్ గా మార్చి 8 శివరాత్రి సందర్భంగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఓటీటీ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హనుమాన్ శివరాత్రికి రిలీజ్ అవుతుంది. తప్పకుండా ఓటీటీలో కూడా ఈ సినిమా సంచలన విజయం అందుకుంటుందని చెప్పొచ్చు.

Also Read : Pushpa 2 : పుష్ప స్పెషల్ ఐటమ్.. రేసులో మరో ముద్దుగుమ్మ..!

  Last Updated: 02 Mar 2024, 04:49 PM IST