Hanuman: హనుమాన్ సరికొత్త రికార్డ్.. 25 సెంటర్లలో 100 రోజులు కంప్లీట్

  • Written By:
  • Updated On - April 23, 2024 / 05:21 PM IST

Hanuman: సంక్రాంతి సందర్భంగా విడుదలైన బ్లాక్ బస్టర్ సూపర్ హీరో చిత్రం హనుమాన్ దేశవ్యాప్తంగా, ఓవర్సీస్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. జాంబీ రెడ్డి తర్వాత నటుడు తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ కలయికలో వచ్చిన రెండో చిత్రమిది. ఈ సినిమా ఇటీవల 25 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధించిన అరుదైన ఫీట్.

ఈ మైలురాయిని మరింత స్పెషల్ గా చేయడానికి, హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ లోని ఏఏఏ సినిమాస్ లో హను-మ్యాన్ స్పెషల్ ప్రీమియర్ ను ప్లాన్ చేసింది చిత్రబృందం. ఈ కార్యక్రమానికి టీమ్ మొత్తం హాజరు కానుండగా, స్పెషల్ స్క్రీనింగ్ అనంతరం చిత్రబృందం మీడియాతో ముచ్చటించనుంది.

సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ మిగతా సినిమాల నుంచి పోటీని తట్టుకొని బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. పెద్ద స్టార్ కాస్ట్ లేకున్నా.. సరిపడ థియేటర్లు లేకపోయినా సినిమా నమ్మకంతో రిలీజ్ చేయడంతో వసూళ్ల వర్షం కురిపించి బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది.