Guru Charan Passes Away : గురు చరణ్ ఇక లేరు

Senior Lyric Writer Guru Charan Died: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. గురుచరణ్ అసలు పేరు మానాపురపు రాజేంద్రప్రసాద్.

Published By: HashtagU Telugu Desk
Senior Lyric Writer Guru Ch

Senior Lyric Writer Guru Ch

Senior Lyric Writer Guru Charan Died: టాలీవుడ్ చిత్రసీమలో వరుస విషాదాలు వినకతప్పడం లేదు. ప్రతి రోజు ఏదోక విషాదకర వార్త వినిపిస్తూనే ఉంది. తాజాగా ప్రముఖ గీత రచయిత గురు చరణ్ (Guru Charan)(77) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. గురుచరణ్ అసలు పేరు మానాపురపు రాజేంద్రప్రసాద్. ఈయన అలనాటి ప్రముఖ నటి ఎం.ఆర్.తిలకం, అలనాటి ప్రముఖ దర్శకుడు మానాపురం అప్పారావుల కుమారుడు. ఎం.ఎ.చదివిన గురుచరణ్ ప్రముఖ గీత రచయిత ఆచార్య ఆత్రేయ దగ్గర శిష్యరికం చేశారు. రెండు వందలకు పైగా సినిమా పాటలు రాశారు.

“ముద్దబంతి పువ్వులో మూగబాసలు”, “కుంతీకుమారి తన కాలుజారి”, “బోయవాని వేటుకు గాయపడిన కోయిలా” లాంటి ఎన్నో సూపర్ హిట్ పాటలున్నాయి. మోహన్‌ బాబుకు ఎంతో ఇష్టమైన పాటల రచయిత గురుచరణ్. మోహన్ బాబు చిత్రాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్నో పాటలను గురుచరణ్ రచించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై తెలుగునాట సంచలనం సృష్టించిన ‘రాజధాని ఫైల్స్’ చిత్రంలో కూడా గురుచరణ్ పాటలు రాశారు. అలాంటి ఆయన ఇక లేరన్న విషయం టాలీవుడ్ సినీ ప్రముఖులను దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. గురు చరణ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, పాటల లవర్స్ సోషల్ మీడియా వేదికగా సంతపాన్ని తెలియజేస్తున్నారు.

Read Also : Madhusudhana Chary : ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యమే: మధుసూధనాచారి

  Last Updated: 12 Sep 2024, 03:46 PM IST