గుంటూరు కారం మూవీ హైదరాబాద్ RTC క్రాస్ రోడ్ లోని సుదర్శన్ 35 ఎంఎం (Sudarshan 35mm) థియేటర్లో సరికొత్త రికార్డు సృష్టించింది. సంక్రాంతి కానుకగా సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) నటించిన గుంటూరు కారం (Guntur Kaaram) మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ డైరెక్షన్లో శ్రీ లీల , మీనాక్షి లు హీరోయిన్లు గా రామకృష్ణ , జగపతి బాబు , రావు రమేష్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ..ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ట్రయిలర్ తో ఊర మాస్ మూవీ అని అభిమానులు భావించిన అటు మాస్ గా లేకుండా , ఇటు క్లాస్ గా లేకుండా ఉండడం తో అభిమానులు తీవ్రంగా నిరాశకు గురయ్యారు. ఇక సినిమా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ రాబడుతుందని..ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకుపైగా వసూళ్లు సాధించినట్లు మేకర్స్ ప్రకటిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె ఈ మూవీ హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సుదర్శన్ 35 ఎంఎం థియేటర్లో అత్యంత వేగంగా రూ.కోటి గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ థియేటర్లో ఆడిన అన్ని మహేష్ బాబు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. అందుకే సుదర్శన్ థియేటర్ అంటే మహేష్ అడ్డా అని అభిమానులు భావిస్తారు. ఇక సంక్రాంతి సందర్భంగా రిలీజైన గుంటూరు కారం మూవీ సుదర్శన్ 35 ఎంఎం థియేటర్లో 17 రోజుల్లోనే రూ.కోటి గ్రాస్ వసూలు చేసింది. అత్యంత వేగంగా ఈ మార్క్ అందుకున్న సినిమాగా నిలిచింది.
ఈ థియేటర్ లో రూ.కోటికి పైగా గ్రాస్ వసూలు చేసిన మహేష్ బాబు ఏడో సినిమా ఇది కావడం విశేషం. గతంలో మురారి (రూ.1.2 కోట్లు), ఒక్కడు (రూ.1.47 కోట్లు), అతడు (రూ.1.04 కోట్లు), పోకిరి (రూ.1.61 కోట్లు), మహర్షి (రూ.1 కోటి) మరియు సరిలేరు నీకెవ్వరు (రూ.1.06 కోట్లు) సినిమాలు కూడా రూ.కోటి కంటే ఎక్కువ వసూలు చేశాయి. అయితే వీటన్నింటిలో గుంటూరు కారం మూవీ మాత్రం అత్యంత వేగంగా కోటి గ్రాస్ వసూళ్లు సాధించి రికార్డు నెలకొల్పింది. మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డ్స్ సాధిస్తుందో చూడాలి.
Read Also : Top News Today: టుడే టాప్ న్యూస్ తెలుగు