Site icon HashtagU Telugu

Guntur Beauty: ఘాటెక్కిస్తున్న ‘గుంటూరు కారం’.. మ‌హేష్ మ‌ర‌ద‌లిగా శ్రీలీల!

Sreeleela

Sreeleela

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో గుంటూరు కారం మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ టైటిల్ పోస్టర్ అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని పెంచింది. మహేశ్ బాబు మాస్ అవతార్ లో కనిపించి అభిమానులను ఫిదా చేశాడు. తాజాగా గుంటూరు కారం సినిమా నుంచి శ్రీలీల ఫ‌స్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. శ్రీలీల (Sreeleela)పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆమె ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు.

ఈ పోస్ట‌ర్‌లో (First look) కంప్లీట్ గా ట్రెడిష‌న‌ల్ లుక్‌లో శ్రీలీల ద‌ర్శ‌న‌మిచ్చింది. కాలి వేళ్ల‌కు నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ శ్రీలీల ఈ పోస్ట‌ర్‌లో క‌నిపిస్తోంది. సోష‌ల్ మీడియాలో ఈ పోస్ట‌ర్ వైర‌ల్‌గా మారింది. గుంటూరు కారంలో (Guntur Kaaram) మ‌హేష్ బాబు మ‌ర‌ద‌లి పాత్ర‌లో శ్రీలీల క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. శ్రీలీల ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె అభిమానులు, నెటిజన్స్ గుంటూరు బ్యూటీ భలే ఉంది.

మ‌హేష్ బాబుతో శ్రీలీల కెమిస్ట్రీ ఈ సినిమాకు ఓ హైలైట్‌గా ఉండ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు. అత‌డు, ఖ‌లేజా త‌ర్వాత మ‌హేష్‌బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ (Trivikram) కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ ఫిల్మ్ ఇది. గుంటూర్ బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యామిలీ ఎమోష‌న్స్‌కు మాస్‌, యాక్ష‌న్ అంశాల‌ను మేళ‌వించి త్రివిక్ర‌మ్ ఈ సినిమాను రూపొందిస్తోన్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే ప్రధాన హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ మూవీలో విలన్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Tamannaah Bhatia: మా ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది: తమన్నా

Exit mobile version