Guntur Kaaram First Review : గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ…వచ్చేసిందోచ్

  • Written By:
  • Publish Date - January 9, 2024 / 02:47 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ (Mahesh – Trivikram) కలయికలో తెరకెక్కిన గుంటూరు కారం (Guntur Kaaram) మూవీ ఫై ఏ రేంజ్ లో అంచనాలు నెలకొని ఉన్నాయో..మాటల్లో చెప్పలేం. వీరిద్దరి కలయికలో గతంలో అతడు , ఖలేజా చిత్రాలు రాగా..ఈ రెండు ప్రేక్షకులను అలరించాయి. ఇక హ్యాట్రిక్ గా రాబోతున్న గుంటూరు కారం ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రంలోని సాంగ్స్ , టీజర్ , స్టిల్స్ ఇలా ప్రతిదీ ఆసక్తి పెంచగా..తాజాగా విడుదలైన ట్రైలర్ దుమ్ములేపింది. సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఈ ట్రైలర్ చెప్పకనే చెప్పింది.

తాజాగా ఈ సినిమా తాలూకా ఫస్ట్ రివ్యూ (Guntur Kaaram First Review) ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇప్పటికే తెలుగు లో చిత్ర సెన్సార్ టాక్ పాజిటివ్ గా రాగా..ఇక ఇప్పుడు దుబాయ్ సెన్సార్ సభ్యుడు ఉమైర్ సందు సినిమాకు సంబదించిన ఫస్ట్ రివ్యూ ను అభిమానులతో పంచుకున్నాడు. సినిమాలో సరికొత్త మహేష్ బాబు ను చూడబోతారని..గతంలో ఎన్నడూ లేని విధంగా మహేష్ ఈ సినిమాలో అదరగొట్టాడని పంచ్ డైలాగ్స్ ,యాక్షన్ , డాన్స్ ఇలా ప్రతిదీ చించేసాడని చెప్పుకొచ్చాడు. మాస్ ప్రేక్షకులు మెచ్చే, వాళ్లకు కావాల్సిన మసాలా అంశాలు ‘గుంటూరు కారం’లో పుష్కలంగా ఉన్నాయని, రూల్స్ తిరగరాసే సినిమా అవుతుందని, పండగ సీజన్ కలిసి వస్తుందని ఉమైర్ సందు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

మరోపక్క గుంటూరు కారం ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో సరికొత్త రికార్డ్స్ నెలకొల్పింది. సోమవారం రాత్రికి… అంటే 24 గంటల్లో ఈ ట్రైలర్ 39 మిలియన్ వ్యూస్ సాధించింది. గతంలో ‘సలార్’ ట్రైలర్ 32.6 మిలియన్ వ్యూస్ తో రికార్డు లో ఉండగా…ఆ రికార్డు ను మహేష్ బ్రేక్ చేసాడు. ఇది చాలు సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో చెప్పడానికి..ఇదిలా ఉంటె ఈరోజు సాయంత్రం ఈ సినిమా తాలూకా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. వాస్తవానికి రెండు రోజుల క్రితం ఈ ఈవెంట్ జరగాల్సి ఉండగా..పోలీసులు అనుమతి నిరాకరించడం తో వాయిదా పడింది.

ఇక ఈ మూవీ లో మహేష్ బాబు సరసన శ్రీ లీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటించగా.. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, మలయాళ హీరో జయరామ్, రావు రమేష్, ‘వెన్నెల’ కిషోర్, ‘రంగస్థలం’ మహేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం మీద సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించారు.

Read Also : CBN-Pawan Met CEC : వైసీపీ ఫై చర్యలు తీసుకోవాలని సీఈవో కు టీడీపీ పిర్యాదు