Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవిని సన్మానించిన గవర్నర్ తమిళి సై

  • Written By:
  • Publish Date - February 9, 2024 / 07:56 PM IST

పద్మ విభూషణ్ (Padma Vibhushan) పురస్కారానికి ఎంపికైన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi )ని తెలంగాణ గవర్నర్ (Telangana Governor) తమిళి (Tamilisai Soundararajan)సై దంపతులు రాజ్ భవన్ లో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఆయన తన సతీమణి సురేఖతో కలిసి హాజరయ్యారు. ఈ ఫొటోలను మెగాస్టార్ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. ‘నాకు ఆతిథ్యమిచ్చి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ కు హృదయపూర్వక ధన్యవాదాలు. తమిళిసై, ఆమె భర్త సౌందరరాజన్ తో మాట్లాడినందుకు ఎంతో ఆనందంగా ఉంది’ అని రాసుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో పాటు మరి కొంతమంది తెలుగు వాళ్లకు కేంద్రం ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. భారత మాజీ ఉప రాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్య నాయుడికి, కేంద్ర మంత్రిగా దేశానికి సేవలు అందించిన చిరంజీవికి పద్మ విభూషన్ ప్రకటించింది. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు వారికి కొందరు స్వయంగా, మరికొందరు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో శిల్పకళా వేదికలో అట్టహాసంగా అవార్డు గ్రహీతలను సత్కరించింది. అలాగే చిరంజీవి కోడలు ఉపాసన సైతం చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం పట్ల గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది. ఈ పార్టీ కి పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఇక ప్రస్తుతం చిరంజీవి ..మల్లిడి వశిష్ఠ (Mallidi Vassishta) డైరెక్షన్లో ‘విశ్వంభర’ (Vishwambhara) అనే. సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10 న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘అతీత శక్తుల పోరాటం నుంచి లెజెండ్స్‌ అవతరిస్తారు’ అంటూ పవర్‌ఫుల్‌ పోస్టర్‌ను రీసెంట్ గా విడుదల చేసి ఆకట్టుకున్నారు.

Read Also : Vote for Note Case : CM రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు