Gopichand : గోపీచంద్ భీమా.. ఛాన్స్ వాడుకుంటాడా..?

Gopichand టాలీవుడ్ హీరోల్లో మాస్ ఫాలోయింగ్ ఉన్న వారిలో మ్యాచో హీరో గోపీచంద్ ఒకరు. లాస్ట్ ఇయర్ రామబాణం సినిమాతో రాగా అది కాస్త మిస్ ఫైర్ అయ్యింది. అందుకే ఈసారి తన మార్క్

Published By: HashtagU Telugu Desk
Gopichand Lucky Chance with Bhima

Gopichand Lucky Chance with Bhima

Gopichand టాలీవుడ్ హీరోల్లో మాస్ ఫాలోయింగ్ ఉన్న వారిలో మ్యాచో హీరో గోపీచంద్ ఒకరు. లాస్ట్ ఇయర్ రామబాణం సినిమాతో రాగా అది కాస్త మిస్ ఫైర్ అయ్యింది. అందుకే ఈసారి తన మార్క్ మాస్ సినిమాతో వస్తున్నాడు గోపీచంద్. కన్నడ స్టార్ డైరెక్టర్ ఏ హర్ష డైరెక్షన్ లో గోపీచంద్ నటించిన సినిమా భీమ. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ లో కె కె రాధా మోహన్ ఈ సినిమా నిర్మించారు. ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన భీమా సినిమా పై ఆడియన్స్ భారీ హైప్ ఏర్పరచింది.

కొన్నాళ్లుగా సరైన హిట్ లేక కెరీర్ లో వెనకపడ్డ గోపీచంద్ భీమాతో హిట్ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు. మార్చి 8 శివరాత్రి కానుకగా వస్తున్న గోపీచంద్ భీమా సినిమాకు విశ్వక్ సేన్ గామి సినిమా పోటీగా వస్తుంది. అయితే ఆ సినిమా జోనర్ వేరే కాబట్టి భీమాపై అంత ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ లేదు.

ఇక మరోపక్క మలయాళ సినిమా ప్రేమలు కూడా తెలుగులో రిలీజ్ అవుతుంది. మలయాళంలో భారీ హిట్ అందుకున్న ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్ ట్రైలర్ ఇంప్రెస్ చేసింది. మరి ఈ మూడు సినిమాల ఫైట్ లో ఏ సినిమా విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Also Read : Vijay Devarakonda Family Star Teaser : ఫ్యామిలీ స్టార్ టీజర్.. దేవరకొండ ఈసారి పర్ఫెక్ట్ ప్లాన్ తో దిగుతున్నాడుగా..!

  Last Updated: 04 Mar 2024, 10:43 PM IST