ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్ (Gopi Sundar) ఇంట విషాద ఛాయలు అల్లుకున్నాయి. తన తల్లి లివి సురేశ్ బాబు (Livi Suresh Babu) (68) కన్నుమూశారు. కేరళలోని కుర్కెన్చెరీలోని తన నివాసమైన అజంతా అపార్ట్మెంట్స్‌లో లివి సురేశ్ బాబు కన్ను మూసారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వడూకరా క్రిమేటోరియం వద్ద గోపీ సుందర్ తల్లి అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. ఈ విషయాన్ని గోపీ సుందర్ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. గోపీ సుందర్ తన బాధను వ్యక్తం చేస్తూ, తన తల్లిని ఓ మార్గదర్శిగా, తన జీవితంలో స్థిరమైన శక్తిగా అభివర్ణించారు. “అమ్మ.. నువ్వు నాకు జీవితాన్ని, ప్రేమను ఇచ్చావు. నా కలలను నిజం చేసుకునే ధైర్యాన్ని ఇచ్చావు. నేను క్రియేట్ చేసే ప్రతీ సంగీతం స్వరంలో నువ్వు నాపై చూపించిన ప్రేమే ఉంటుంది. నువ్వు వెళ్లిపోలేదు. నా మనసులో, మెలోడీస్‌లో, నేను వేసే ప్రతీ అడుగులో ఉన్నావు. నీ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. కానీ నువ్వు నాతోనే ఉంటూ నన్ను చూస్తున్నావని నాకు తెలుసు. రెస్ట్ ఇన్ పీస్ అమ్మ. నువ్వు ఎప్పటికీ నా బలానివి. నాకు దారి చూపించే వెలుగువి ” అంటూ తన సోషల్ మీడియా పోస్టులో గోపీ సుందర్ ఎమోషనల్ గా రాసుకొచ్చారు.
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు, రాధాకిషన్‌రావుకు బెయిల్
గోపీ సుందర్ షేర్ చేసిన పోస్ట్ చూసి అభిమానులు సైతం ఎమోషనల్ అవుతున్నారు. తనకు ధైర్యం చేకూరాలని కోరుకుంటున్నారు. తన తల్లి మృతికి సంతాపం తెలియజేస్తూ పోస్టులు షేర్ చేస్తున్నారు. 2006లో విడుదలయిన ‘నోట్‌బుక్’ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్‌గా మాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు గోపీ సుందర్. కానీ అది కూడా కేవలం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేయడానికి మాత్రమే తనకు అవకాశం దక్కింది. ఆ తర్వాత కూడా ఎన్నో సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించడానికి మాత్రమే తనను ఎంపిక చేశారు మేకర్స్. తన మ్యూజిక్ ప్రేక్షకులకు అంతగా నచ్చింది.