ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్ (Pawankalyan).. రాబోయే రోజుల్లో కొత్త సినిమాలు చేస్తారా అనే సందేహం అభిమానుల్లో నెలకొంది. గత కొన్ని నెలలుగా రాజకీయాలు, సామాజిక సేవ, ప్రజా సంక్షేమమే తన ప్రాధాన్యత అని పవన్ స్పష్టంగా తెలియజేశారు. ఇటీవల జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలోనూ ఇదే స్పష్టతను కల్పించారు. సభలో అభిమానులు “ఓజీ” అని నినదించినప్పటికీ, వారిని నివారించడం చూస్తే ఆయన సినిమాలపై ఆసక్తి తగ్గినట్టుగా అర్థమవుతోంది. రాజకీయాల్లో అధిక సమయం గడిపే పవన్ కళ్యాణ్ ఇక సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పే అవకాశముంది.
Cash For Bed Rest: బెడ్ రెస్ట్ ఆఫర్.. 10 రోజులకు రూ.4.70 లక్షలు
వాస్తవానికి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు కంప్లీట్ చేయాల్సి ఉంది. పవన్ ఆరోగ్యం కూడా గతం మాదిరి సహకరించడం లేదు. తన చిన్న కొడుకుని కూడా ఎత్తుకోలేనంత బలహీనంగా మారిపోయానని చెప్పడం ఆయన ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలకు బలం చేకూర్చింది. దీంతో హరిహర వీరమల్లు విడుదలైన తర్వాత, ఓజీతో తన సినీ ప్రయాణాన్ని ముగిస్తారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే పవన్ కళ్యాణ్ నుండి ఆఖరి చిత్రం OG నే అవుతుంది. గతంలో అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్, పార్టీ నడిపేందుకు నిధుల అవసరంతో తిరిగి సినిమాల్లోకి వచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నం. ఉపముఖ్యమంత్రి హోదాతో పాటు కీలక శాఖల బాధ్యతలు నిర్వహించాల్సిన పవన్, ఇక సినిమాలకు ఎక్కువ సమయం కేటాయించలేరు. ఈ క్రమంలో తన ప్లేస్ లో తన కుమారుడు అకీరా నందన్‌ను రంగంలోకి దించే ఆలోచన చేస్తున్నాడు. రెండేళ్లలో అకిరా ను హీరోగా పరిచయం చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.