Baahubali 3: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. బాహుబలి మళ్లీ వచ్చేస్తున్నాడు, అప్డేట్ ఇదిగో!

పాన్ ఇండియన్ మూవీస్ తో బిజీగా ఉన్న ప్రభాస్ బాహుబలి రూపంలో మరోసారి ప్రేక్షకులకు ముందుకొచ్చే అవకాశాలున్నాయి.

  • Written By:
  • Updated On - April 22, 2023 / 04:12 PM IST

టాలీవుడ్ డార్లింగ్ బాహుబలి (Baahubali) సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీస్ కావడంతో ప్రభాస్ ఇండియన్ సెలబ్రిటీల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రభాస్ అనగానే బాహుబలి 1, 2 సినిమాలు గుర్తుకువస్తాయి. ఈ రెండు సినిమాలు ఆయన్ను ప్రపంచవ్యాప్తంగా ఎంతో అభిమానులను సంపాదించి పెట్టాయి. ఇప్పటికీ ప్రభాస్ ను బాహుబలిగానూ గుర్తుంచుకుంటున్నారు జనాలు. అయితే లెటేస్ట్ సమాచారం ఏంటంటే త్వరలో బాహుబలి3 (Baahubali3) వచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

బాహుబలి నిర్మాతలు (Producers) శోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలతో ప్రభాస్ (Prabhas) ఓ ఎగ్జైటింగ్ మూవీ కోసం చర్చలు జరుపుతున్నాడని సమాచారం. “వారు కొంతకాలంగా కొన్ని ప్రాజెక్ట్‌ల గురించి చర్చిస్తున్నారు. అయితే వారు ముఖ్యంగా మిగిలిన వాటి కంటే ఒక సబ్జెక్ట్‌ని ఎక్కువగా ఇష్టపడ్డారు అన్ని సినిమాల్లో బాహుబలిలో వారు చేసిన దానికి పూర్తి భిన్నంగా ఉంది. ఇది వరకు ఎప్పుడూ చూడని పాత్రలో ప్రభాస్ పాత్ర (Chraracter)ను డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ తాను కమిట్ అయిన సినిమాల తర్వాత ఈ మూవీ కార్యరూపం దాల్చే అవకాశం ఉంది.

బాహుబలి నిర్మాత ప్రసాద్ దేవినేని కూడా బాహుబలి 3 సినిమా గురించి గతంలో మాట్లాడారు. “బాహుబలి ప్రపంచంలో మరో కథ చెప్పడానికి స్కోప్ ఉందని, స్వయంగా రాజమౌళి (Rajamouli) కూడా చెప్పాడని అన్నారు. ప్రతిదీ సరిగ్గా జరిగితే ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మనం దానిని సాధించవచ్చు. కానీ ప్రస్తుతం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు’ అని ప్రసాద్ దేవినేని అన్నారు. అయితే, ప్రభాస్, శోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిల మధ్య కొనసాగుతున్న చర్చలు బాహుబలి 3 గురించి కాదని, మరొక ప్రాజెక్ట్ అని కూడా తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ తో సలార్, నాగ్ అశ్విన్ తో ప్రాజెక్టు కే, మారుతితో రాజా డీలక్స్, ఓం రౌత్ తో ఆదిపురుష్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.

Also Read: Pooja Hegde Upset: పూజా హెగ్డేను వెంటాడుతున్న ఫ్లాపులు.. బుట్టబొమ్మ ఖాతాలో ఐదో డిజాస్టర్!