Power Star పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తాను అనుకున్న స్థాయిని అంటే పార్టీ పెట్టిన 10 ఏళ్ల తర్వాత ఆయన డిప్యూటీ సీఎం స్థాయిని ఊహించారో లేదో తెలియదు కానీ జనసేన పార్టీ ప్రభావం ఏపీ ఎన్నికల్లో చూపించాలనుకున్న కోరిక మాత్రం తీరింది. ఈ క్రమంలో పవర్ స్టార్ డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలను పూర్తిగా నిర్వర్తిస్తూ ప్రజల నుంచి మంచి స్పందన తెచ్చుకుంటున్నారు. ఐతే రాజకీయాలు ఓకే మరి పవన్ సినిమాల పరిస్థితి ఏంటని కొందరు అడుగుతున్నారు.
ఐతే పవర్ స్టార్ సినిమాల గురించి ఫ్యాన్స్ కూడా చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ప్రస్తుతం పవన్ 3 సినిమాలు సెట్స్ మీద ఉండగా వాటిని పూర్తి చేసి రిలీజ్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుతున్నారు. కానీ పవన్ ఇప్పుడప్పుడే సినిమాలకు డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదని ఓ టాక్ వచ్చింది. ఐతే అది ఫ్యాన్స్ ని నిరుత్సాహ పరుస్తుండగా లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి షూటింగ్ లో పాల్గొనే టైం దగ్గర పడిందని అంటున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తుంది. ముందు సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న OG ఆ తర్వాత హరి హర వీరమల్లు ఈ రెండు సినిమాలకు పవర్ స్టార్ డేట్స్ ఇచ్చే ప్లానింగ్ లో ఉన్నారని తెలుస్తుంది. పవర్ స్టార్ అక్టోబర్ నుంచి మళ్లీ షూటింగ్స్ షురూ చేయనున్నాడు.
ఓజీ, వీరమల్లు సినిమాలు ముందు పూర్తి చేసి ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఆలోచిస్తారని తెలుస్తుంది. వీరమల్లు సినిమాను 2025 సంక్రాంతి రిలీజ్ అంటున్నారు. ఐతే ఓజీ మాత్రం నెక్స్ట్ సమ్మర్ కి భారీ టార్గెట్ తోనే వస్తుందని చెబుతున్నారు.
Also Read : Natural Star Nani : టైర్ 1 కి సరిపోయే కంటెంట్..!