Global Star Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) తాజాగా నటించిన చిత్రం గేమ్ చేంజర్. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ రిలీజ్ రోజు నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. కొంతమందికి మూవీ నచ్చగా.. మరికొందరికి నచ్చలేదు. అయితే ఈ మూవీ తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 186 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు నిర్మాతగా వ్యవహారించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రకటించింది.
రామ్ చరణ్ స్పెషల్ థాంక్స్
గేమ్ చేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ తాజాగా అభిమానులకు, చిత్రబృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఒక నోట్ విడుదల చేశారు. “ఈ సంక్రాంతి నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. గేమ్ చేంజర్ మూవీతో ఈ సంక్రాంతి నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. ఈ సినిమాలో నేను చేసిన పాత్రకు మంచి రివ్యూలు ఇచ్చిన మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. 2025 మంచి శుభారంగేభంతో ప్రారంభించాను. ఇకపై అభిమానులు గర్వపడేలా ప్రతి సినిమా చేసేందుకు ప్రయత్నిస్తా. గేమ్ చేంజర్ మూవీకి నా మనసులో ప్రత్యేక స్థానం ఏర్పడింది. అభిమానులు నాపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు. మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు.
ఇకపోతే గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్‌తో పాటు హీరోయిన్‌గా కియారా అద్వానీ నటించారు. ఈ మూవీలో ఎస్‌జే సూర్, శ్రీకాంత్, సునీల్, బ్రహ్మానందం, అంజలి, తదితరులు నటించారు. ఒక రాజకీయ నాయకుడికి- కలెక్టర్ మధ్య జరిగే రాజకీయ పోరాటమే గేమ్ చేంజర్ మూవీ. శంకర్ తన మార్క్‌తో పాటు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు.
Also Read: Zuckerberg Vs Indian Govt : భారత ఎన్నికలపై జుకర్‌బర్గ్ వ్యాఖ్యలు.. మెటాకు మోడీ సర్కారు సమన్లు
#RamCharan's Thank You Note for #GameChanger Reception from Audiences. pic.twitter.com/RBnK4si9uM
— Gulte (@GulteOfficial) January 14, 2025
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కుటుంబంతో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన సతీమణి ఉపాసన.. చెర్రీ, క్లీంకారతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఇంతకాలంగా మాపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు కృతజ్ఞతలు’ అని ఉపాసన పేర్కొన్నారు.